Anti Aging Foods: 60 ఏళ్ల వయసొచ్చినా కొందరిలో వృద్ధాప్య ఛాయలే కనిపించవు.. ఎందుకనే డౌట్ వచ్చిందా..? వీటిని తింటే..!
ABN, First Publish Date - 2023-09-22T14:04:09+05:30
బచ్చలికూరలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది, ఇది ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ అందంలో తేడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చర్మం. నిగారింపు తగ్గి, అక్కడక్కడా ముడతలతో వయసు పైన పడుతుందనే విషయాన్ని ఇట్టే తెలిసేలా చేస్తాయి. అయితే దీనికి మందులకన్నా కూడా ఆరోగ్యకరమైన ఆహారమే సపోర్ట్ గా నిలుస్తుంది. ఇది చాలామంది పాటించకపోయినా, కొందరిలో మనం గమనిస్తూనే ఉంటాం. సరైన ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకునే వారిలో ఈ ముసలి ఛాయలు ఎంత వెతికినా కనిపించవు. అదే కొందరిలో అయితే వయసు చిన్నదే అయినా వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తాయి. నిజానికి మనం కూడా ఇవే పదార్థాలను తింటాం కానీ వాటిని మామూలు పదార్థాలుగా మాత్రమే చూస్తాం. మనలో చాలామందికి ఆరోగ్యాన్ని కాపాడి, వయసును దాచే ఈ పదార్థాలమీద కనీస అవగాహన కూడా ఉండకపోవచ్చు. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
20 ఏళ్లు లేదా 30 ఏళ్లలో ఉన్నవారిలో చర్మం నీరసంగా ఉండటం, గీతలు, కళ్ల దగ్గర ముడతలు వంటివి ఇప్పటికే ముఖంపై కనిపించడం ప్రారంభించాయా? అయితే, చర్మం అకాల వృద్ధాప్యంతో బాధపడుతోంది, అంటే వృద్ధాప్యం సమయం కంటే ముందే అలా కనిపించడం ప్రారంభించింది. దీనికి ప్రధాన కారణాలు అధిక ఒత్తిడి, తీవ్రమైన జీవితం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటివి. అయితే, హెక్టిక్ అండ్ బిజీ లైఫ్ స్టైల్ వల్ల చర్మానికి కలిగే డ్యామేజీని తగ్గించి, ముఖం మళ్లీ యంగ్ అండ్ గ్లోయింగ్ లుక్‌ని పొందవచ్చు. దీని కోసం, ఆహారంలో కొన్ని విషయాలను జోడించాలి అవేమిటంటే..,
క్యారెట్
క్యారెట్‌లో బీటా కెరోటిన్, ఆరెంజ్ పిగ్మెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఈ కూరగాయల రసం తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ద్రాక్ష
ఈ తీపి, పుల్లని పండులో రెస్వెరాట్రాల్, విటమిన్ సి ఉన్నాయి. ద్రాక్షలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ కణాల విచ్ఛిన్నతను నివారిస్తుంది. పర్పుల్ ద్రాక్ష రసాన్ని రోజూ తాగితే, ధమనులలో గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
నారింజ
సిట్రస్ ఫ్రూట్ ఆరెంజ్‌లో విటమిన్ సి మాత్రమే కాకుండా యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ మూలకాలు చర్మానికి మాత్రమే కాకుండా, క్యాన్సర్‌ను నివారించడంలో, కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
ఉల్లిపాయ
దాదాపు ప్రతి ప్రతి వంటకంలోనూ వాడుతూనే ఉంటారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ధమని గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఉల్లిపాయ శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
ఇది కూడా చదవండి: భవిష్యత్తును నిర్ణయించేవి ఈ 10 అలవాట్లే.. వీటిల్లో ఏ ఒక్కటి మీకున్నా వెంటనే మార్చుకోండి..!
క్యాబేజీ
ఈ కూరగాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా, UV కిరణాల నుండి చర్మాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని పచ్చిగా లేదా తేలికగా ఉడికించి తినవచ్చు. క్యాబేజీని తేలికగా వేయించడం, ఆవిరి మీద ఉడికించడం మంచిది. దీని కారణంగా, దాని పోషకాలు శరీరానికి అందుతాయి.
బచ్చలికూర
బచ్చలికూరలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది, ఇది ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాటరాక్ట్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. బచ్చలికూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది రక్త నాళాలను బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
టమోటా
యాంటీఆక్సిడెంట్లు, లైకోపీన్, ప్రధానంగా కలిగిన కూరగాయ టమోటా. ఇది అన్నవాహిక, కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. టమోటాలను ఉడికించినా లేదా డబ్బాలో ప్యాక్ చేసినా వాటి లైకోపీన్ నాశనం కాదు. అందుకే దాని రసం తాగినా, సాస్ తిన్నా, గ్రేవీలో కలిపినా, ఈ రెడ్ వెజిటేబుల్ లక్షణాలు యవ్వన రూపాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
Updated Date - 2023-09-22T14:06:41+05:30 IST