ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weight Loss: బాన పొట్టను యమా ఈజీగా కరిగించాలనుకుంటున్నారా..? ఒక్కసారి దీన్ని ట్రై చేయండి..!

ABN, First Publish Date - 2023-08-19T12:22:46+05:30

దాల్చిన చెక్క నీటిని తయారు చేయడానికి, ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్కను లేదా పొడిని వేసి రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత త్రాగాలి.

weight loss tips

ఓ స్థాయికి వచ్చాకా మన శరీరాన్ని మోయడం మనకే కష్టంగా ఉండటం, నచ్చిన దుస్తుల్ని వేసుకోలేకపోవడం, వేగంగా కదలలేని స్థితి, నలుగురిలో చురుకుదనం లేకపోవడం, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో ఏదో డైట్ ఫ్లాన్ మొదలుపెడతారు కానీ నిజానికి దీనిమీద ఎక్కువకాలం పనిచేయలేరు. దీనితో అధికమైన బరువు పెరిగిపోయి శరీరంలో అస్సలు దాయలేని భాగంలో ముఖ్యంగా పొట్ట భాగంలో అధిక కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పెడుతుంది. దీనిని త్వరగా వదిలించుకోవాలంటే ఈ ఈజీ పద్దతిని ఫాలో అయ్యి చూడండి. అదేమిటంటే..

బరువు తగ్గడంలో మొదటి అడుగు ఆహారంపై శ్రద్ధ పెట్టడం. ఆహారం సమతుల్యంగా ఉంటే, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గడం కూడా ప్రారంభమవుతుంది. దీనికి మరీ ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుండా వంటగదిలో వాడే వస్తువులతోనే బరువు తగ్గచ్చు. వీటిల్లో దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్కను చాలా వంటకాల్లో మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం. ఇది మంచి సుగంధంతోపాటు, కాస్త ఘాటుగా ఉంటుంది. అయితే దాల్చిన చెక్కతో శరీరంలో పేరుకున్న కొవ్వును ఈజీగా కరిగించవచ్చట. దీనితో బరువు తగ్గడం అనేది చాలా సులువు అవుతుంది.

1. బరువు తగ్గడానికి దాల్చిన చెక్క టీ తయారు చేసి తాగవచ్చు. దీని కోసం ఒక కప్పు నీరు, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలి. ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకుని దాల్చిన చెక్క వేసి మరిగించాలి. దీన్ని ఒక కప్పులో జల్లెడ పట్టి అందులో నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. దాల్చిన చెక్క టీ ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. అయితే ప్రత్యేకంగా తాగలేని వాళ్ళు, లేదా టీ కాఫీలకు అలవాటు పడినవాళ్ళు, దాల్చిన చెక్కను కాఫీలో కలుపుకుని కూడా తాగవచ్చు. ఇది కాఫీ రుచిని పెంచుతుంది.


ఇది కూడా చదవండి: రాత్రిళ్లు వీటిని తినడం మానేయండి.. ఇష్టం కదా అని ఈ ఐదింటిని తింటే జరిగేది ఇదే..!

2. బరువు తగ్గడానికి దాల్చిన చెక్క నీటిని తయారు చేసి త్రాగడం కూడా మంచిదే. దాల్చిన చెక్క నీటిని తయారు చేయడానికి, ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్కను లేదా పొడిని వేసి రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత త్రాగాలి. దాల్చిన చెక్క నీరు త్రాగిన తర్వాత, మరేమీ తినకూడదు.

3. దాల్చిన చెక్కను కూరలు, స్మూతీస్, హాట్ చాక్లెట్, షేక్స్‌లో కూడా భాగంగా చేసుకోవచ్చు. ఇది శరీరంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. దాల్చినచెక్కను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. లేకుంటే అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

Updated Date - 2023-08-19T12:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising