ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cloves Making: వంటింట్లో డబ్బాల్లో కనిపించే లవంగాలు.. అలా తయారవడానికి ఎంత శ్రమ దాగి ఉందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-07-08T12:31:34+05:30

విలక్షణమైన రుచి, సువాసన వెనుక బయోయాక్టివ్ సమ్మేళనాల కారణంగానే, లవంగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

natural remedy.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్యాకుమారిలోని బ్లాక్‌రాక్ ఎస్టేట్‌లో లవంగాలను పండిస్తారు. ఇక్కడి నుంచి దాదాపు భారతదేశంలో మొత్తం 1,100 టన్నుల లవంగాలు ఉత్పత్తి అవుతుండగా, తమిళనాడులో దాదాపు 1,000 టన్నుల వరకూ ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 65% పైగా జిల్లాలోనే పండిస్తున్నారు. కన్యాకుమారి జిల్లాలోని కొండ ప్రాంతాలలోని వాతావరణం లవంగం సాగుకు అనువైనది. ఈ ప్రాంతం నైరుతి, ఈశాన్య రుతుపవనాల కారణంగా లవంగం సాగు జరుగుతుంది.అలాగే, ‘సీ మిస్ట్’ సముద్రపు పొగమంచు లవంగం పంటకు అవసరమైన తేమను పెంచుతుంది. సేంద్రియ పోషకాలు పుష్కలంగా ఉన్న ఇక్కడి నల్ల నేల లవంగం సాగుకు అనుకూలం. దీంతో ఈ ప్రాంతంలో పండే లవంగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మార్కెట్ పరంగా కూడా మంచి లాభాలున్న సాగు.

లవంగం చెట్లకు చాలా జాగ్రత్త అవసరం. వాటిని సరిగ్గా పుష్పించేలా చేయడానికి, క్రమం తప్పకుండా ఫలదీకరణం చెందేలా చూస్తారు. మామూలుగా లవంగాల మొక్క 7వ లేదా 8వ సంవత్సరం తర్వాత మాత్రమే, పంట దిగుబడికి అనువుగా ఉంటాయి. మామూలుగా అవి దాదాపు 15 నుండి 20 సంవత్సరాల తర్వాత దిగుబడిని ఇచ్చేందుకు అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. మొగ్గలు ఆకుపచ్చ నుండి రంగును మార్చడం ప్రారంభించినప్పుడు గులాబీ రంగులో ఉండగానే, పంటను కోసేందుకు పికింగ్ దశను వస్తాయి. ఇక్కడే జాగ్రత్తగా పంటను కోయాలి. ఈ చెట్లు చాలా పొడవుగా ఉండి, చిటారు కొమ్మల్లో కాపు కాస్తాయి కనుక నిచ్చెల ద్వారా చెట్లపైకి ఎక్కి లవంగం పంటను కోస్తారు.

ఈ చెట్లు 60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కాబట్టి, చెట్లు పొడవుగా ఉన్నాయని కొమ్మలను వంచడం లేదా కర్రలతో మొగ్గ కర్రలతో పడగొట్టడానికి ప్రయత్నించడం వల్ల చెట్ల భవిష్యత్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి, కోత చాలా జాగ్రత్తగా జరుగుతుంది. కోసిన మొగ్గలను తాటి చాపలపై ఆరబెడతారు. ఈ ప్రక్రియ దాదాపు 4 నుండి 5 రోజులు పడుతుంది. అనుభవజ్ఞుడైన లవంగం పంట గురించి తెలిసిన వారు మాత్రమే ఎండబెట్టడం, పంట అమ్మాకానికి సిద్ధం అయిందీ లేనిది చెప్పగలుగుతాడు.

ఇది కూడా చదవండి: గంటల తరబడి వంటింట్లో మగ్గిపోతుంటారు కానీ.. ఈ ట్రిక్‌ను పాటిస్తే వంట పని చిటికెలో పూర్తి..!

లవంగం, సిజిజియం సుగంధ చెట్టు నుంచి, దాని సుగంధ పూల మొగ్గల నుండి తీస్తారు. ఇది సాంప్రదాయ వైద్యంలోనూ, వంటకాలలోనూ శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న అత్యంత విలువైన మసాలా. విలక్షణమైన రుచి, సువాసన వెనుక బయోయాక్టివ్ సమ్మేళనాల కారణంగానే, లవంగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడటం నుండి జీర్ణక్రియకు సహాయం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వరకు, ఈ మసాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Updated Date - 2023-07-08T12:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising