Lemon water : ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటున్నారా? మీకీ సంగతి తెలుసా..!
ABN, First Publish Date - 2023-10-20T15:53:35+05:30
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల నోటిపూత వస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల నోటిపూత బాధిస్తుంది. దీనిని మరీ ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంటను కలిగిస్తుంది.
ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటే అదీ తేనెతో కలిపి తాగితే ఊబకాయం సమస్య ఉండదంటారు. నిమ్మకాయ పరిమాణంలో చిన్నదే అయినా నిమ్మకాయ చాలావరకూ ఆరోగ్యపరంగా అందరికీ ఉపయోగపడుతూనే ఉంటుంది. నిమ్మరసం తరచుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం, కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దానిని అవసరం అయిన దానికంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల లాభాలకంటే కూడా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
నిమ్మరసం తాగితే కలిగే లాభాలు..
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల నోటిపూత వస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల నోటిపూత బాధిస్తుంది. దీనిని మరీ ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది సిట్రస్ ఫుడ్. మైగ్రేన్ సమస్య ఉన్నవారు దీనిని అస్సలు తినకూడదు, ఎందుకంటే ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. అలాగే ఇది జుట్టు మీద చెడు ప్రభావం చూపుతుంది. ఇది స్కాల్ప్ డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల జుట్టు పొడిబారుతుంది.
ఇది కూడా చదవండి: కంటిచూపు బలహీనంగా ఉంటే.. పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకొంటే ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుందంటే..!
అంతే కాదు తెల్ల జుట్టు వస్తుంది. కొంతమంది నిమ్మరసాన్ని గోరువెచ్చని నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటారు. ఇలా చేయాలనుకుంటే దానిని ఇక నుంచి అరగంటకు మించి ఉంచొద్దు. అలాగే నిమ్మరసాన్ని చర్మానికి రాసుకుంటే దద్దుర్లు రావచ్చు. దీని వల్ల మొటిమలకు రాసుకోవడం వల్ల తగ్గడానికి బదులు పెరుగుతాయి. పొడి చర్మం ఉన్నవారు ఇలా చేయకూడదు. ఒక వ్యక్తి నిమ్మరసాన్ని తరచుగా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం దంతాలలో సున్నితత్వం క్షయం కలిగిస్తుంది. అందుకే పరిమితంగా తీసుకోవాలి.
Updated Date - 2023-10-20T15:53:35+05:30 IST