ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Curry Leaves: పాతికేళ్ల వయసుకే తెల్ల జుట్టు వచ్చేసిందా..? జుట్టు రాలిపోతోందా..? కరివేపాకులే ఓ అద్భుతమైన మెడిసిన్ అని తెలుసా..?

ABN, First Publish Date - 2023-08-23T14:38:58+05:30

ఒక గిన్నెలో కొబ్బరి నూనెను గ్యాస్‌పై వేసి వేడి కరివేపాకు వేసి కాసేపు వేగించిన తర్వాత మంట ఆపేయాలి.

curry leaves

ఒతైన జుట్టుతో నిగనిగలాజుతూ మెరిసే జడ చూసినప్పుడు అబ్బా.. ఇంత జుట్టు భలే పెరిగిందే అనుకుంటూ ఉంటాం. ఇప్పటి రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరికీ హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యకు కెమికల్స్ తో నిండిన ఉత్పత్తుల కన్నా, ఇంటి చిట్కాల ద్వారా వీటికి చెక్ పెట్టవచ్చు. అదెలాగంటే..

జుట్టు సంరక్షణలో, సహజంగా జుట్టును కాపాడే రెమిడి అనగానే గోరింటాకు అనుకుంటారు. కానీ గోరింటాకు ఎర్రదనం కన్నా, కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టుకు ఒకటి కాదు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. జుట్టుకు విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్, బీటా కెరోటిన్‌లను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడం నుండి తెల్ల జుట్టు సమస్యను దూరం చేయడం వరకు కరివేపాకులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

కరివేపాకు జుట్టుకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టుకు రూట్ నుండి పోషణను అందిస్తాయి. జుట్టుకు కరివేపాకును అప్లై చేసిన తర్వాత జుట్టు మృదువుగా మారుతుంది. వెంట్రుకలు అవసరమైన తేమను పొందుతాయి, దీని వల్ల వెంట్రుకలు పొడిబారిన సమస్య ఉండదు. కరివేపాకు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: ఏ ఇంట్లో చూసినా ఇదే సమస్య.. రూపాయి ఖర్చు లేకుండా బొద్దింకల బెడద తప్పాలంటే..!


జుట్టు రాలడానికి ఈ చిట్కా సరిపోతుంది.

కొబ్బరి నూనె, కరివేపాకు కలిపి అప్లై చేయడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. ఒక గిన్నెలో కొబ్బరి నూనెను గ్యాస్‌పై వేసి వేడి కరివేపాకు వేసి కాసేపు వేగించిన తర్వాత మంట ఆపేయాలి. నూనె కాస్త చల్లారాకా జుట్టుకు రాసుకోవచ్చు.

తెల్ల జుట్టు నుండి నలుపు

కరివేపాకును హెయిర్ మాస్క్ గా తయారు చేసుకోవచ్చు. హెయిర్ మాస్క్ చేయడానికి, పావు కప్పు కరివేపాకు పేస్ట్ తీసుకొని అందులో అరకప్పు పెరుగు కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుపై అరగంట పాటు ఉంచిన తర్వాత కడగాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి 2 నుండి 3 సార్లు అప్లై చేయవచ్చు. దీనితో మంచి ఫలితాలు ఉంటాయి.

Updated Date - 2023-08-23T14:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising