ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drinking Water: ఓరి దేవుడో.. ఇదేం ట్విస్ట్.. మంచినీళ్లను ఎక్కువగా తాగితే జరిగేది ఇదేనా..?

ABN, First Publish Date - 2023-08-01T14:13:12+05:30

ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తంలో నీటి స్థాయి పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది

benefits of drinking, water

నీరు ప్రాణాధారం. జీవకోటికీ నీరు కావాలి. సరైన సమయానికి నీరు అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. అలాంటి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, క్రమం తప్పకుండా రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. అయితే దీనికన్నా ఎక్కవ నీరు తీసుకునేవారూ ఉన్నారు. అయితే నీటిని ఎక్కువ మోతాదులో తాగితే శరీరానికి మంచిది కదనే వాదన కూడా ఉంది. ఇంతకీ నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి?

మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల నీరు త్రాగాలి, అయితే దీని కంటే ఎక్కువ నీరు తీసుకోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందట. మనం ఎక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

ఎక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కిడ్నీ స్టోన్, చర్మం, కళ్ళు పొడిబారడం వంటి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కానీ అతిగా తాగడం వల్ల కూడా ఓవర్ హైడ్రేషన్‌కు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: ఎక్కువగా టీ తాగితే చర్మం రంగు నల్లగా మారిపోతుందా..? చిన్న పిల్లల్ని టీ తాగొద్దని ఎందుకు అంటారంటే..!


2. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. ఎక్కువ నీరు త్రాగితే, నీటిలోని మలినాలతో విషంగా మారే సమస్యను ఎదుర్కొనవచ్చు. ఇది మూత్రపిండాల పనితీరును పెంచుతుంది, దీని ఫలితంగా శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి.

3. ఓవర్‌హైడ్రేషన్ కారణంగా హైపోనాట్రేమియా వంటి వ్యాధి కలగవచ్చు. వాంతులు, తలనొప్పి, తరచుగా మూత్రవిసర్జన, కండరాల తిమ్మిరి ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు.

4. ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తంలో నీటి స్థాయి పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

Updated Date - 2023-08-01T14:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising