Gaming addiction: వేసవిలో పిల్లలకి ఆన్లైన్ గేమ్స్‌తో వలేసేందుకు సైబర్ నేరగాళ్ళు రఢీ.. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త..!
ABN, First Publish Date - 2023-04-25T12:07:51+05:30
గేమ్స్ ఆడి పెద్దల బ్యాంక్ ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్ళకు అందించడమో, లేదా ఆడలాడి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడమో చేస్తున్నారు.
వేసవి సెలవులు ఇచ్చేసారు. పిల్లలు స్కూల్ గొడవలేదని, కాస్త రిలాక్స్ గా ఉండే సమయం ఇదే. ఇంకాస్త సమయం ఇంట్లో గడపడానికి, నచ్చిన ఆటలు ఆడుకోవడానికి అలాగే సెలవులకి బంధువుల ఇళ్ళకు వెళ్ళేందుకు ఇప్పటి నుంచే ఫ్లాన్ చేసుకునే సమయం కూడా ఇదే. కాకాపోతే ఈ కరోనా కాలంలో నుంచి అలవాటైన ఫోన్ పిల్లలకు ఇప్పడో కొత్త ప్రపంచం.
అందులో ఆటలాడుకోవడం, గేమింగ్, సెల్ ఫోన్ గేమ్స్ మోజులో శారీరక శ్రమ మరిచిపోయి సోఫాల్లో కూడబడి గంటల తరబడి ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ కాలాన్ని గడిపేసే కేటగిరీ కొందరు. వీళ్ళ సమయాన్ని గేమ్ లో పెడుతున్నామనుకుంటారే గానీ మెదడుకు మరో ఆలోచన లేకుండా చేసి ఫ్రీజ్ చేస్తున్నామనే ఆలోచనను వదిలేస్తున్నారు.
ఈ గేమ్స్ ఆడే సమయంలో వేరే ఆలోచనే కాదు. అసలు ఏం జరుగుతుందనే సరైన ఆలోచనే ఉండదు. పిల్లలకి. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళ పాలిట వరమైంది. ఎనిమిదేళ్ళ నుంచి, పదహారేళ్ళ పిల్లలే ఇప్పుడు వీటికి బానిసలుగా మారిపోయి ఆడుతున్నారు. ఇలాగే కదా గతంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతుకు భూ పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 1.05 కోట్ల రూపాయలను ఇంటర్ చదివే విద్యార్థి ఆన్లైన్ గేమ్ కింగ్ 527 ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పెట్టి డబ్బునంతా పోగొట్టాడు. దాదాపు 92 లక్షల రూపాయలు ఈ గేమ్స్ లో పెట్టి మోసపోయాడు.
ఇదే ఇప్పుడు సైబర్ మోసగాళ్ల ఉచ్చు. ఆడండి.. గెలుచుకోండని పిల్లలకు రకరకాల నోటిఫికేషన్స్ పంపి వాళ్ళను ఆశచూపి ఆడేవిధంగా చేస్తున్నారు. ఈ వెబ్ సైట్లు ఛత్తీస్ గడ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే.. ఆరోగ్యంలో ఎలాంటి తేడాలు రావు..లేదంటేనే..!
మారాం మోసపోయేలా చేస్తుంది..
ఆన్లైన్ క్లాసులకు ఫోన్ కావాలని మారాం చేసి మరీ కొనిపించుకుని, గేమ్స్ ఆడి పెద్దల బ్యాంక్ ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్ళకు అందించడమో, లేదా ఆడలాడి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడమో చేస్తున్నారు. పిల్లలే కదా అనుకుని మారాం తీర్చే తల్లిదండ్రులకు పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఇదంతా ఫోన్ లో ఓ ఆకర్షణీయమైన లింక్ క్లిక్ చేయడం వల్ల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను సైబర్ నేరగాళ్ళకు అందిస్తున్నారు.
దీనికి పెద్దవాళ్ళు వాటి వివరాలు తెలీకుండా ఉంచాలి. ఇక ఆన్లైన్ బ్యాంక్ ఖాతాను వాడే వీలు అందరికీ లేకుండా ఫింగర్ ఫ్రింట్ పెట్టుకోవడం మరీ మంచిది. ఇలా చేయడం మన ఫోటోలు, కాంటాక్ట్ లు, వీడియోలు, మన వ్యక్తిగత సమాచారం అంతా సైబర్ నేరగాళ్ళకు చిక్కకుండా చేస్తుంది. అలాగే అనుమాస్పద లింక్ ఏదైనా క్లిక్ చేయకుండా, నకిలీ యాప్ లను క్లిక్ చేయకుండా పెద్దలే చర్యలు తీసుకోవాలి. లేదంటే చిన్న పొరపాటు పెద్ద ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇచ్చేప్పుడు పెద్దలు ఓకంట కనిపెట్టడం ముఖ్యం.
Updated Date - 2023-04-25T12:07:51+05:30 IST