ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ginger-Hair: కూరల్లో వాడే అల్లానికి.. జుట్టుకు సంబంధమేంటని అవాక్కవుతున్నారా..? అల్లాన్ని ఇలా వాడితే..!

ABN, First Publish Date - 2023-07-13T14:41:09+05:30

వాతావరణ మార్పుల వల్ల ఒత్తైన జుట్టు, నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవాళ్ళు తక్కువే.

strong hair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందంగా, ఒత్తుగా మెరుస్తున్న జుట్టు ఉన్నవాళ్ళను చూస్తే, కాస్త శ్రద్ధగా గమనిస్తాం. వాళ్ళేం షాంపూ వాడుతున్నారోనని. పెరుగుతున్న కాలుష్య స్థాయిల వల్ల, వాతావరణ మార్పుల వల్ల ఒత్తైన జుట్టు, నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవాళ్ళు తక్కువే. రకరకాల కారణాలతో జుట్టును కోల్పోతున్నవారే ఎక్కువ. పర్యావరణ క్షీణత కారణంగా చర్మం, జుట్టు నష్టపోవడం ఎక్కువైంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే అందుబాటులో ఉండే పదార్థాలతో, సాంప్రదాయ పద్దతులతోనే సాధ్యం.

ముఖ్యంగా భారతదేశంలో, అల్లం అనేది చాలా గృహాలలో సులభంగా కనుగొనబడే సహజమైన పదార్ధం. అనేక సాంప్రదాయ ఔషధాలలో కూడా అల్లన్ని, ఉపయోగిస్తారు, ఇది కడుపు నొప్పికి, జలుబు, ఫ్లూని తగ్గించడంలో సహాయపడుతుంది. సాంప్రదాయ పద్ధతులలో, అల్లం తరచుగా మంట, జీర్ణ వ్యాధుల కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా, అల్లం దాని యాంటీఆక్సిడెంట్, క్రిమినాశక లక్షణాల కారణంగా, మొటిమలు, చర్మం కాలిన గాయాలు, చుండ్రు, జుట్టు పెళుసు దనం మారడం వంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగిస్తారు.

జుట్టు పెరుగుదల విషయానికి వస్తే, అల్లం ఒక శక్తివంతమైన పదార్ధం, దీనిలో ఎన్నో శక్తివంతమైన లక్షణాలన్నాయి. అల్లం తల చర్మం, జుట్టు కుదుళ్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అల్లాన్ని అనేక రూపాల్లో జుట్టు కోసం ఉపయోగించవచ్చు. అల్లం నూనె రూపంలో వస్తుంది, దీనిని క్యారియర్ ఆయిల్‌తో కలిపి, మాస్క్‌గా అప్లై చేసి, 15 నుంచి 30 నిమిషాలలో కడగాలి. అల్లం మూలాల నుండి సేకరించిన అల్లం రసం కూడా తలకు ఉపయోగకరంగా ఉంటుంది..


ఇది కూడా చదవండి: Mouthwash vs Oil Pulling: అసలేంటీ ఈ అయిల్ పుల్లింగ్..? మౌత్ వాష్‌కు, దీనికి తేడాలేంటి.? రెండింటిలోనూ ఏది బెటర్ అంటే..!

జుట్టు కోసం అల్లం..

1. అల్లం చుండ్రుతో పోరాడుతుంది.

పొడి స్కాల్ప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. ఇది సాధారణంగా చుండ్రుతో ఉంటుంది. అల్లంలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, చుండ్రుని ఎఫెక్టివ్‌గా తగ్గించడంలో సహాయపడతాయి. షాంపూలో తాజా అల్లం కలుపుకుని తలకు మసాజ్ చేయడం వల్ల చుండ్రుతో బాధపడుతున్నవారికి ఉపశమనం ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలో చిరాకు, దురదను తగ్గించడంలో సహాయపడతాయి.

2. తలకు అల్లం పూయడం

తల ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, వెంట్రుక కుదుళ్లు కూడా దృఢంగా మారతాయి. అల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ఇవి జుట్టు నాణ్యతను బలోపేతం చేయడంలో సహాయపడతాయి, జుట్టును పొడవుగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. చివర్లు చీలిపోయే అవకాశాలను తగ్గిస్తుంది.

3. అల్లం జుట్టును కండిషన్ చేస్తుంది.

అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు పోషణను అందించడంలో ఉపయోగపడతాయి, అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు హెయిర్ ఫోలికల్స్‌ను రక్షిస్తాయి.

Updated Date - 2023-07-13T14:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising