ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

White Hair: తెల్లజుట్టుకు వారం వారం హెయిర్ డై వేస్తున్నారా ? ఇక అంత శ్రమ అవసరం లేదు..ఇలా చేసి చూడండి.

ABN, First Publish Date - 2023-04-12T14:47:37+05:30

బయట మార్కెట్లలో లభించే చాలా హెయిర్ కలర్స్ తో పోలిస్తే..

White Hair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరికీ తెల్లజుట్టు అనేది సహజం. తెల్లజుట్టుకు చిన్న పెద్దా బేధం లేకుండా పోతుంది. అయితే ఈ తెల్లజుట్టును మాయం చేస్తాయని మార్కెట్ లోకి చాలా హెయిర్ కలర్స్ వచ్చినా కూడా జుట్టుకు ఓ పదిరోజులు ఈ నలుపుదనం ఉంటుందికానీ మళ్ళీ తెలుపు రంగు జుట్టు కనిపిస్తూనే ఉంటుంది. సమయానికి హెయిర్ కలర్ వేయడం ఆలస్యం చేస్తే చాలు ఇక చెంపల్లో మెరిసిన జుట్టు తెల్లగా కనిపిస్తూ వెక్కిరిస్తుంది. అయితే దీనికి చెక్ పెట్టాలంటే సహజంగా దొరికే వాటితో దీనికి పరిష్కారం చూడవచ్చు. అది ఎలాగంటే..

తెల్లజుట్టుకు గోరింటాకు, నీలి ఆకు..

మామూలుగా గోరింటాకు మన కేశాలకు మంచి చల్లదనాన్ని ఇస్తుందని కొందరు జుట్టుకు పూస్తూ ఉంటారు. అయితే జుట్టు మరీ రాగి రంగులో కనిపిస్తుందని కొందరు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అయితే ఒత్తైన నల్లటి కురులకోసం నీలి ఆకుల పొడిని కలిపి గోరింటాకుతో పెట్టుకోవడం వల్ల తెలుపు దనం నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. బయట మార్కెట్లలో లభించే చాలా హెయిర్ కలర్స్ తో పోలిస్తే నీలి ఆకు గోరింటాకు కురులకు సహజపద్దతిలో నలుపును ఇస్తుంది.

ఇది కూడా చదవండి: డిస్ట్రోఫీ గురించి మీకేం తెలుసు? ఈ కండరాల బలహీనతకు వారసత్వ అనారోగ్యాలే కారణమట..!

మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి.

దీనికోసం గాజు కప్పును మాత్రమే వాడాలి. రెండు చిన్న కప్పులు గోరింటాకు పొడికి ఒక చిన్న కప్పు నీలిఆకు పొడి, ఒక కప్పు ఉసిరి పొడి, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు టీ డికాషన్, ఒక నిమ్మకాయ రసం కలిపి రాత్రి నానబెట్టాలి. దానిని ఉదయం బాగా కలిపి జుట్టును పాయలుగా చేసి తల మొత్తం పట్టించాలి.

ఓ గంట తరువాత చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఈ సమయంలో జుట్టుకు షాంపూను వాడకూడదు. ఈ మిశ్రమం పెట్టిన రోజు తరవాత షాంపూతో తల స్నానం చేయాలి. వారం వారం క్రమం తప్పకుండా జుట్టుకు ఈ మిశ్రమాన్ని పెట్టుకోవడం వల్ల తలకు చల్లగా ఉండడమే కాకుండా వెంట్రుకలు నల్లగా మారతాయి.

Updated Date - 2023-04-12T14:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising