ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mango: మామిడి పండ్లను తింటే కొందరికి మొటిమలు రావడం వెనుక అసలు కారణం ఇదే.. తినేముందు ఈ 3 టిప్స్ ఫాలో అయితే..!

ABN, First Publish Date - 2023-06-15T10:38:57+05:30

ఈ కారణంగానే మామిడి పండు సీజన్‌లో మొటిమల సమస్య వస్తూ ఉంటుంది.

Skin Care
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేకించి వేసవిలో దొరికే మామిడి పండ్లంటే ఇష్టపడని వారంటూ ఉంటారా? వీటిని మార్కెట్లో వచ్చినంత కాలం తిని ఆనందించేవారే ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఇష్టంగా తింటున్న మామిడి పండ్లతో చిన్న చిన్న సమస్యలు కూడా తప్పవు. మామిడి పండ్లను తినే కొందరిలో మొటిమల సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఎందుకు వస్తాయి. ఈ మొటిమలను నివారించడానికి టిప్స్ గురించి తెలుసుకుందాం.

ఎందుకు మొటిమలు వస్తాయి?

మామిడి పండును తిన్నప్పుడు అది రక్తంలో చక్కెరను పెంచుతుంది. మామిడి మాత్రమే కాదు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఇన్న చాక్లెట్లు, క్యాండీలు, పేస్ట్రీలు, జంక్ ఫుడ్ మొదలైనవి తిన్నా కూడా ఈ సమస్య కనిపిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మన శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌లను కలిగిస్తాయి, ఎందుకంటే ఇది సెబమ్ స్రావాన్ని పెంచడం ద్వారా మన శరీరంలోని నూనె గ్రంథులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగానే మామిడి పండు సీజన్‌లో మొటిమల సమస్య వస్తూ ఉంటుంది.

పరిశోధన ప్రకారం, ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.

కొందరు వ్యక్తులు మామిడిలో ఉండే సిట్రిక్ యాసిడ్‌ను తట్టుకునేందుకు వీళ్ళు శరీర పరంగా సున్నితంగా ఉంటారు. దీని కారణంగా మొటిమలు, చర్మం మీద మంట ఏర్పడుతుంది.

ఇది కూడా చదవండి: టూత్ బ్రష్ బాగానే ఉంది కదా అని అరిగేదాకా వాడేస్తున్నారా..? అయితే మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!

ఇందులో ముఖ్య కారణం మామిడి పండ్లు సహజంగా పండించకపోవడం, సకాలంలో పండించేందుకు కృత్రిమ ఎరువులు, స్ప్రేలను, పక్వానికి రావడానికి రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఇవి మన చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. జీర్ణ సమస్యలను, మొటిమలను కలిగిస్తాయి.

ఈ పండ్లను తిన్నప్పుడు ఇబ్బందిని ఎదుర్కున్నట్లయితే మామిడి పండు ఇకపై ఆరోగ్యానికి మంచిది కాదని దూరంగా ఉండటం మంచిది. లేదంటే ఇది చర్మానికి కూడా హాని చేస్తుంది.

మామిడి పండ్లను తిన్న తర్వాత మొటిమల సమస్యను నివారించాలంటే..

1. తినడానికి ముందు వాటిని 2 నుంచి 3 గంటలు నానబెట్టండి. నానబెట్టడం వల్ల వాటిలోని అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. ఇందులో ఫైటిక్ యాసిడ్ అనేది యాంటీ న్యూట్రియంట్, ఇది ఇనుము, జింక్, కాల్షియం ఇంకా ఇతర ఖనిజాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది.

2. మామిడి పండ్లను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టినప్పుడు శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిస్తుంది. పోషకాలను బాగా గ్రహించేలా చేస్తుంది. నానబెట్టడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు, తలనొప్పి, మలబద్ధకం, ఇతర సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

3. మామిడిని ఒక పండులానే తినాలి. భోజనంతో కలపకూడదు. భోజనంతో కలపడం వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి భోజనానికి 1 గంట ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత మామిడి పండ్లను తినాలి.

4. మామిడి పండుతో 1 స్పూన్ సబ్జా గింజలు తీసుకోండి. ఇవి శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తాయి. మొటిమలను నివారించడంలో సహాయపడతాయి.

Updated Date - 2023-06-15T10:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising