Rice Tea: అల్లం టీ, లెమన్ టీ తాగే ఉంటారు కానీ.. రైస్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-07-15T16:41:45+05:30
రాంచీలో రైస్ టీ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది.
బియ్యంతో టీనా ఎప్పుడన్నా తాగారా? బియ్యంతో అన్నం వండేప్పుడు వచ్చే గంజి సంగతి తెలుసుగానీ, బియ్యంతో టీ ఏంటో కొత్తగా ఉందని అనుకంటున్నారా? కానీ రైస్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందట. దీనిలో ఎన్నో ఆరోగ్యవంతమైన గుణాలున్నాయి. రైస్ టీ అంటే బ్లాక్, రెడ్ రైస్‌తో తయారు చేస్తారు. మేఘాలయా ప్రాంతంలో దీనిని షా కూ చాయ్ అని పిలుస్తారు. జపనీయులు బ్రౌన్ రైస్‌తో ఈ టీని తయారు చేస్తారు. వాళ్ళు ఈ టీని జెన్మాయిషా అని పిలుస్తారు. దీనికోసం వేయించిన బ్రౌన్ రైస్‌తో పాటు గ్రీన్ టీని కూడా వాడుతుంటారు.
మన దేశంలో ఉదయం పూట టీ దుకాణం నుంచి ఇళ్ల వరకూ అంతా టీ తాగుతూ కనిపిస్తారు. కొంతమంది ఉదయాన్నే గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారు, మరికొందరు చక్కెర, టీ ఆకులు, పాలు కలిపి టీ తాగిన తర్వాత శక్తి వస్తుందని నమ్ముతారు. అయితే ఇప్పుడు చెప్పుకునే టీ వీటన్నింటికన్నా ప్రత్యేకమైనది. ఈ టీ ఆరోగ్యానికి దివ్యౌషధం కూడా.
రైస్ టీ
జార్ఖండ్ రాజధాని రాంచీలో రైస్ టీ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఉదయాన్నే రైస్ టీ తాగడంతోనే రోజును ప్రారంభిస్తారు. చాలా మంది గిరిజనులు తమ ఇళ్లలో ఈ టీని తయారు చేసుకుంటారు. షాపుల్లో కూడా రైస్ టీ చాలా ఫేమస్. రాంచీలోని దంగ్రాటోలి చౌక్ సమీపంలోని ఫీల్డ్, ఫారెస్ట్ కేఫ్‌లో ఈ టీని ఎక్కువగా తయారు చేస్తారు. దీని రుచిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు.
ఇది కూడా చదవండి: కష్టపడకుండానే కొవ్వు కరగాలంటే.. రోజూ పొద్దునే గ్లాసుడు నీళ్లల్లో ఈ గింజలను కలుపుకుని తాగితే..!
రైస్ టీ ఎలా తయారు చేయాలి.
రైస్ టీ చేయడానికి రెడ్ రైస్‌ను ఉపయోగిస్తారు. ఎర్ర బియ్యాన్ని ఒక పాత్రలో వేసి తేలికగా వేయించాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో మూడు నుంచి నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. దీని తరువాత, దానికి అల్లం, బిర్యానీ ఆకు, బెల్లం వేసి మరికొన్ని నిమిషాలు మరిగించాలి. చాలా మంది దీనిలో కొద్దిగా ఉప్పు వేసి, ఈ టీని తీసుకుంటారు. ఈ టీ గిరిజనులకు ఇష్టమైన పానీయం.
ఈ వ్యాధులలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
రైస్ టీ కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులను నయం చేస్తుంది. అదేవిధంగా ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ సి వంటి అనేక మినరల్స్ రెడ్ రైస్‌లో లభిస్తాయి, ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీనితో పాటు, డయాబెటిక్ రోగులు కూడా దీనిని తీసుకోవడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది
Updated Date - 2023-07-15T16:41:45+05:30 IST