Aggression in children: పిల్లల్లో దూకుడు తగ్గించాలంటే.. ఇలా చేసి చూడండి..!
ABN, First Publish Date - 2023-03-30T15:25:25+05:30
పిల్లలలో దూకుడు తరచుగా నిరాశ, కోపం ప్రతికూల భావోద్వేగాల నుండి మొదలవుతుంది.
పిల్లల్లో దూకుడు స్వభావం మామూలుగా తల్లిదండ్రుల పెంపకం, గారాబం విషయంగానే కాకుండా అంతర్లీన కారణాలను కలిగి ఉంటుంది. వాళ్ళతో కాస్త నెమ్మదిగా విషయం అడిగి తెలుసుకోవాలికానీ, పెద్దవాళ్ళు కూడా కలిపి అరిచి, తిట్టి, కట్టడం చేస్తే మరీ మొండిగా తయారవుతారు. అంతే కాకుండా ఇదే వాళ్ళ ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇటువంటి పిల్లల్ని కాస్త నెమ్మదిగానే దగ్గరకు తీసుకోవాలి. అదెలాగంటే..
దూకుడుగా ఉన్న పిల్లలు మాటవినేలా చేయాలంటే..,
ప్రశాంతంగా ఉండండి: కోపం, విసుగు, అసహనంగా ఉండే పిల్లలతో వ్యవహరించేటప్పుడు, ప్రశాంతంగా, కంపోజ్డ్‌గా ఉండటం చాలా అవసరం. ఇది పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. వారిని దగ్గరకు తీసుకునేప్పుడు తల్లిదండ్రులు నియంత్రణలోనే ఉన్నారని పిల్లలకి తెలియజేయాలి. దీనివల్ల వారిలో మరింత తీవ్ర లక్షణాలు కనిపించకుండానే కాస్త తగ్గి మీ దగ్గరకు వచ్చే వీలుంటుంది.
భావాలను పంచుకోండి: పిల్లలలో దూకుడు తరచుగా నిరాశ, కోపం, ప్రతికూల భావోద్వేగాల నుండి మొదలవుతుంది. పిల్లల దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి, వారి భావాలను గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు.
స్థలం ఇవ్వండి: పిల్లలు ఎక్కువగా కలత చెందుతున్నట్లయితే, ప్రశాంతంగా ఉండటానికి వారిని కొంత సమయం ఒంటరిగా వదిలేయడం మంచిది.
ఇది కూడా చదవండి: బీట్‌రూట్ జ్యూస్ వల్ల బెనిఫిట్స్ ఏమిటంటే..?
దృష్టిని మళ్లించండి: కొన్నిసార్లు, పిల్లల దృష్టిని మళ్లించడం వారిని కూల్ జేయడానికి సహాయపడుతుంది.
సహాయం చేయమనండి: పిల్లల దూకుడు తనం తీవ్రంగా ఉంటే, చిన్న పనుల్లో సాయం చేయమనండి. స్కూల్ లో రోజువారి సమయాన్ని ఎలా గడుపారో అడగండి. ఇది కాస్త వారిని మీతో కలుపుతుంది. లేక పరిస్థితి మరీ చేయి దాటిపోయి పిల్లలు మాట వినకపోతే మాత్రం చైల్డ్ సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్ ని కలవడం అన్ని విధాలా మంచిది.
Updated Date - 2023-03-30T18:55:34+05:30 IST