Health Facts: ఎర్రగా కనిపిస్తున్న ఈ చిన్న పండును వారానికి రెండు సార్లు తింటే చాలు.. బరువు తగ్గిపోవడం యమా ఈజీ..!
ABN, First Publish Date - 2023-09-11T13:17:18+05:30
పచ్చిగా తినలేని వారు వాక్కాయ జ్యూస్ కూడా తాగవచ్చు. దీనివల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.
వర్షాకాలంలో ప్రధానంగా లభించే కరౌండా కూరగాయ, అదే మనమంతా వాక్కాయగా పిలుచుకుంటూ ఉంటాం. వాక్కాయతో పప్పు ఆంధ్రాలో ఫేమస్ వంటకం. అంతేనా వీటితో కేక్స్ తయారీలో, కిళ్ళీలలో ఎర్రని చెర్రీలుగా పెట్టి అలంకరిస్తూ ఉంటారు. ఇవి మిగతా ప్రాంతాలలో అంతగా ప్రసిద్ధి చెందలేదు. రుచిలో పుల్లని క్రాన్బెర్రీస్ గురించి విని ఉండకపోవచ్చు. కానీ ఇందులో చాలా రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సరిగ్గా తీసుకుంటే, అది ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. దీనితో బరువు తగ్గడమే కాకుండా, అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వాక్కాయల్ని రెండు విధాలుగా తినవచ్చు, వీటి ప్రయోజనాల గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం.
ఈ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు
1. జీర్ణశక్తిని బలపరుస్తుంది.
వాక్కాయతో చేసిన పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. దీనితో, జీర్ణవ్యవస్థ సాధారణంగా పని చేస్తుంది. అజీర్ణం, కడుపు నొప్పి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
2. మెదడును చురుకుగా ఉంచుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, మెరుగుపరచడంలో వాక్కాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తపోటు వంటి వ్యాధుల అభివృద్ధిని నిరోధిస్తుంది. క్రాన్‌బెర్రీస్‌లో ఉండే ఐరన్, విటమిన్ బి, విటమిన్ సి మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.
3. జ్వరం నుండి ఉపశమనం..
జ్వరం వచ్చినప్పుడు, వాక్కాయ ఆకులను తీసుకోవడం లైఫ్‌సేవర్‌లా పనిచేస్తుంది. దీన్ని నమలడం వల్ల జ్వరం తగ్గి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
4. బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు, ఈ విషయంగా బరువు పెరగడం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారికి వాక్కాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వరుసగా తీసుకుంటే నెలలో కిలోల బరువును తగ్గుతారు.
ఇది కూడా చదవండి: రేటు ఎక్కువ అని పెద్దగా పట్టించుకోరు కానీ.. ఈ బోడ కాకరకాయల వల్ల ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..!
వాక్కయ తింటే..
1. రసం
వాక్కాయ కూర తయారు చేయలేనివారు, పచ్చిగా తినలేని వారు వాక్కాయ జ్యూస్ కూడా తాగవచ్చు. దీనివల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.
2. చట్నీ
వాక్కాయ చట్నీ రూపంలో తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాక్కాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. క్రాన్‌బెర్రీ చట్నీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Updated Date - 2023-09-11T13:17:18+05:30 IST