Woman: పెదవులకు దగ్గరగా ఓ మొటిమ.. చూడటానికి బాగాలేదని చిదిమేసిన మహిళ.. మర్నాడు నిద్రలేచిన తర్వాత చూస్తే..!
ABN, First Publish Date - 2023-10-04T16:19:15+05:30
అందమైన ముఖం మీద మెటిమలు రావడం అనేది సహజం. వస్తుంటాయి, కాస్త ఇబ్బంది పెట్టి పోతుంటాయి. అయితే ఆమె విషయంలో విచిత్రమైన అనుభవమైంది.
అందమైన ముఖం మీద మెటిమలు రావడం అనేది సహజం. వస్తుంటాయి, కాస్త ఇబ్బంది పెట్టి పోతుంటాయి. అయితే ఆమె విషయంలో విచిత్రమైన అనుభవమైంది.
ఈ మహిళ లూసియానాకు చెందినది, సోషల్ మీడియాలో తన సంఘటన గురించి చెప్పింది. తన ముఖంపై చిన్న మొటిమ కనిపించగానే దానిని చిదిమేసింది. ఇది ఆమె పెదవులకు దగ్గరగా ఉన్నందువల్ల మొటిమను పాప్ చేసింది. ఉదయం లేచి చూసేసరికి ముఖం మొత్తం వాచిపోయింది.కాస్త కంగారుగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ ఇది స్టాప్ ఇన్ఫెక్షన్ అని తేల్చాడు. ఇది ఆమె చర్మంపై మొటిమలా వచ్చింది. ఈ బ్యాక్టీరియా పొరపాటున రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తే, అది పక్షవాతం లేదా సెప్సిస్, చివరికి మరణానికి కారణమవుతుందని తేలేసరికి ఆశ్చర్యపడటం తప్ప మరో దారేం తెలీలేదు ఆమెకు. చిన్న మొటిమతో ఇంత ప్రమాదం ఉందా అని ఆశ్చర్యపడ్డారు ఆవిషయం తెలుసుకున్న నెటిజన్లు.
ఇది కూడా చదవండి: కొవ్వును కరిగించే ఆరు డ్రింకులు.. డైట్‌లు, కసరత్తులతోనే కాదండోయ్.. వీటిని తాగినా బరువు తగ్గొచ్చు..!
చిన్న పొరపాటు ప్రాణాలను బలిగొంటుంది..
మాయో క్లినిక్ ప్రకారం, మన చర్మం, ముక్కులో నివసించే ఒక ప్రత్యేక రకమైన బ్యాక్టీరియా (స్టాఫ్ ఇన్ఫెక్షన్లు) వల్ల స్టాఫ్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది ప్రమాదకరమైనది కానప్పటికీ, ఇది రక్తంలోకి ప్రవేశిస్తే కీళ్ళు, ఊపిరితిత్తులు, ఎముకలు, గుండెకు చేరుతుంది. వైద్యులు దీనిని యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు, అయితే మొటిమను పాప్ చేయకూడదని సలహా ఇస్తారు, తద్వారా బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి చేరదు. కాబట్టి ఇక నుంచి ముఖం మీద కనిపిస్తున్న మొటిమలను చిదిమే ప్రయత్నం చేయకండి.
Updated Date - 2023-10-04T16:19:15+05:30 IST