ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: 30 ఏళ్ల వయసు దాటిందా..? వెంటనే మీరు చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే..!

ABN, First Publish Date - 2023-07-20T14:58:29+05:30

దానితో పాటు హెచ్‌పివి పరీక్ష చేయడం చాలా మంచిది.

check your eyes regularly

వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. దీనితో పాటే ఆరోగ్యం కూడా ఉంటుంది. ఓ వయసుకు వచ్చాకా శరీరం మీద కాస్త శ్రద్ధపెట్టి మెడికల్ గా చేయించాల్సిన టెస్ట్స్ చాలానే ఉన్నాయి. యవ్వనంలో ఉన్నప్పుడు, చాలా ఉత్సాహంగా ఉంటారు. అన్ని రకాల పనులు, వ్యాయామాలు, సాహసాలను చేయగల శక్తిని కలిగి ఉంటారు. జీవక్రియ బాగా పని చేస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అన్ని రకాల ఆహారాలు, పానీయాలను ఆస్వాదిస్తారు కూడా. అయితే వయస్సు మీదపడుతుంటే మాత్రం శరీరంలో కాల్షియం క్షీణించడం ప్రారంభమవుతుంది. శరీరంలో నొప్పులు, జీవక్రియ మందగించడం, బరువు పెరగడం వంటి సమస్యలతో పాటు థైరాయిడ్, హైపర్‌టెన్షన్, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులను వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, 30, 40, 50 ఏళ్లలో అవసరమైన పరీక్షలు చేయిస్తూనే ఉంటే, ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.

30 ఏళ్లలోపు వారికి టెస్ట్ అవసరం.

1. 30 సంవత్సరాల నుండి ప్రతి స్త్రీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. దానితో పాటు హెచ్‌పివి పరీక్ష చేయడం చాలా మంచిది. హ్యూమన్ పాపిల్లోమావైరస్లు (Papillomaviruses) లేదా HPV వివిధ రకాల గర్భాశయ, సంబంధిత క్యాన్సర్లకు కారణమవుతాయని తెలింది. అందుకని ఈ పరీక్షలు ముందుగా సమస్యను గమనించే వీలుకల్పిస్తాయి.

2. పురుషులు, మహిళలు ఇద్దరూ 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రీడయాబెటిస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ కోసం టెస్ట్ చేయించాలి. ఊబకాయం ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలి.

3. ఊబకాయం ఉన్నవారు వెంటనే డైటీషియన్‌ను సంప్రదించి, బాడీ మాస్ ఇండెక్స్‌ (Body mass index) ని పరీక్ష చేయించుకుని, బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.

40వ దశకంలో చేయాల్సిన పరీక్షలు..

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, ఒక మహిళ 40 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రామ్‌లను చేయాలి. 45 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, 54 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మామోగ్రామ్ (Mammogram) చేయాలి. పురుషులు, మహిళలు ఇద్దరూ 45 ఏళ్లు దాటిన తర్వాత కొలొరెక్టల్ (Colorectal) క్యాన్సర్‌ను పరీక్షించాలి.

ఇది కూడా చదవండి: పాలిచ్చే తల్లులూ.. పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తినొద్దు.. ఎంత ఇష్టమైన కర్రీలైనా సరే..!


ఒకవేళ 40 ఏళ్ల తర్వాత కళ్లను క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటే, కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కుటుంబంలో ఉంటే, ఇది చాలా ముఖ్యం. ఈ స్క్రీనింగ్‌లు కంటిశుక్లం, గ్లాకోమాను గుర్తించగలుగుతాయి.

50 ఏళ్ల తర్వాత పురుషులు, మహిళలకు పరీక్షలు..

రుతుక్రమం ఆగిపోయిన దశలో ఉన్న స్త్రీలు తప్పనిసరిగా బోలు ఎముకల వ్యాధి కోసం పరీక్షించబడాలి. 5o నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు ఇద్దరూ ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.

ప్రోస్టేట్ క్యాన్సర్‌ (Prostate cancer) కు సంబంధించిన కుటుంబ చరిత్ర కలిగిన పురుషులు 50 ఏళ్లకు చేరుకున్న తర్వాత దాని కోసం స్క్రీనింగ్ చేయించుకోవాలి.

Updated Date - 2023-07-20T14:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising