Health Tips: కొబ్బరి నూనె.. బాదం పప్పు.. కరివేపాకు.. ఇదేం కాంబినేషన్ అని అవాక్కవుతున్నారా..? లాభమేంటో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-07-12T14:46:45+05:30
తినే ఆహారంలో మార్పుల వల్లనో, లేక విపరీతమైన పని ఒత్తిడి కారణంగానో జుట్టు ఒత్తుగా రావడంలేదు, పైగా ఇట్టే రాలిపోతుంది కూడా.
ఒత్తైన జుట్టు కావాలంటే, బలమైన వెంట్రుకలు కావాలి. ఇప్పటి రోజుల్లో బలమైన జుట్టు ఉన్నవారు తక్కువే. తినే ఆహారంలో మార్పుల వల్లనో, లేక విపరీతమైన పని ఒత్తిడి కారణంగానో జుట్టు ఒత్తుగా రావడంలేదు, పైగా ఇట్టే రాలిపోతుంది కూడా.
ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ఎఫెక్టివ్ రెమెడీలున్నాయి. పిల్లల జుట్టు అందంగా ఒత్తుగా మారాలంటే దానికి చేయాల్సిన పని జుట్టుకు నూనెను పూయాలి, ఇది అంతా చేసే పనేకదా ఇందులో ఏం ప్రత్యేకత ఉంది అనుకోవద్దు. ఈ నూనెను మనమే దగ్గరుండి తయారుచేసుకుని వాడాల్సి ఉంటుంది. ఇది జుట్టుకు బలాన్ని ఇస్తుంది. అలాగే ఒత్తుగా మారేందుకు సహకరిస్తుంది.
ఇది కూడా చదవండి: పొట్ట తగ్గడం ఇంత ఈజీనా..? ఎన్ని పనులున్నా సరే.. రోజూ ఈ 4 పనులు చేయండి చాలు..!
జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా తయారవుతుంది, ఈ ఆయుర్వేద హెయిర్ ఆయిల్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. దీన్ని చేయడానికి, ఒక బాణలిలో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేయాలి, ఆపై బాదం, 10 కరివేపాకును వేసి బాగా ఉడికించాలి. దీని తర్వాత దానిని స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ చేసి ప్లాస్టిక్ లేదా గాజు సీసాలో నిల్వ చేయండి.
ఇప్పుడు పిల్లల జుట్టుకు వారానికి మూడుసార్లు అప్లై చేసి, తలకు మంచి మసాజ్ చేయండి, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టుకు మెరుపును ఇస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
Updated Date - 2023-07-12T14:46:45+05:30 IST