Jaggery: బెల్లాన్ని కరిగించి.. సూప్‌లా చేసుకుని రోజూ తాగితే జరిగేదేంటి..? అసలు బెల్లాన్ని రోజూ తినొచ్చా..?
ABN, First Publish Date - 2023-06-15T15:53:25+05:30
ఇది కాలేయంలో వేడిని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది.
మనం రోజూ తీసుకునే ఆహారంలో మరీ ఇష్టంగా తినేది తీపి పదార్థాలే. అందులో బెల్లం అయితే పిల్లలకు పెద్దలకు అందరికీ ఆరోగ్యమని నమ్ముతాం. చాలా వరకూ బెల్లంతో తయారు చేసిన వంటకాలనే తినడానికి ఇష్టపడతాం. అయితే ఈ బెల్లాన్ని రోజూ ఆహారంలో తీసుకోవచ్చా? రోజూ బెల్లాన్ని తినడం వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉంటుంది. ఆరోగ్యానికి రోజూ బెల్లం తినడం మంచిదేనా? అదే తెలుసుకుందాం.
బెల్లం అనేది సహజ చక్కెరతో కూడిన ఆహార పదార్థం. ఇది చెరకు లేదా తాటి రసం నుండి తయారు చేస్తారు. బెల్లం ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. బెల్లంలో పోషకాల గురించి చెప్పాలంటే ఇందులో గ్లూకోజ్, సుక్రోజ్ పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరెన్, జింక్, కాపర్, ఫోలిక్ యాసిడ్, బి. కాంప్లేక్స్ వంటి విటమిన్లు, ఖనిజాలు బెల్లంలో ఉన్నాయి. ఇన్ని పోషకాలున్న బెల్లాన్ని వేసవిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మంచి జరుగుతుందంటే..
వేసవిలో బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. నీటిలో బెల్లం కరిగించి, సిరప్ లాగా త్రాగితే, అది శరీరంలోని హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. దీని వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు.
ఇది కూడా చదవండి: మిగిలిపోయిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం తప్పు కాదు కానీ.. ఎన్ని రోజుల్లోగా వాడేయాలో కూడా తెలుసుకోండి..!
2. బ్లడ్ షుగర్ ఉన్న రోగులు బెల్లం తినవచ్చు, ఎందుకంటే దీనిని సహజ స్వీటెనర్ అంటారు. బెల్లం గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బెల్లం హిమోగ్లోబిన్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాలేయంలో వేడిని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది.
3. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడే వారికి కూడా బెల్లం చాలా మేలు చేస్తుంది. ఇది రుతుచక్రాన్ని నియంత్రించడంలో పనిచేస్తుంది. బెల్లం హార్మోన్లను సమతుల్యం చేయడానికి, వంధ్యత్వానికి తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
మామూలుగా 100 గ్రాముల బెల్లంలో 383 కేలరీలు ఉన్నాయి. ఇందులో 11 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. ప్రోటీన్, కొవ్వు 0.1 మిల్లీగ్రాములు, కాల్షియం 85 మిల్లీగ్రాములు, భాస్వరం 20 మిల్లీగ్రాములు ఇన్ని పోషకాలున్న బెల్లాన్ని రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది.
Updated Date - 2023-06-15T15:53:25+05:30 IST