Mango: మామిడి పండ్లను తిన్నాక మీకెప్పుడైనా ఇలా అనిపించిందా..? అయితే వెంటనే మ్యాంగో తినడం మానేయండి..!
ABN, First Publish Date - 2023-06-02T16:56:23+05:30
మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీచు పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు కలిగే ప్రమాదం ఉంది.
వేసవికాలం వచ్చిందంటే వేడి ఎండలతోపాటుగా తీయని మామిడిపండ్లు కూడా మార్కెట్ లోకి వస్తాయి. నోరూరిస్తాయి. మామూలుగా మామిడిపండ్లకు మంచి కాలం. మామిడి పండ్లను తినడానికి ఇష్టపడేవారైతే, ఈ వేసవిలో మామిడి పండ్ల రుచిని ఆస్వాదించే ముందు, దాని దుష్ప్రభావాలు కూడా తెలుసుకోండి. మార్కెట్‌లో ప్రతిచోటా వివిధ రకాల మామిడి పండ్లు లభిస్తాయి. మామిడిపండ్లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా, రుచికరంగా ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువగా తినడం వల్ల, అవి శరీరంపై కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతాయట. అందుకే ఈ వేసవిలో మామిడి పండ్లను తినే ముందు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే..
మామిడి దుష్ప్రభావాలు
1. కొన్ని పరిశోధనలు మామిడిలో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని చెబుతున్నాయి. ఈ పండును ఎల్లప్పుడూ మితంగా తినాలట. ఎందుకంటే మామిడి పండ్లను ఎక్కువగా తింటే డయేరియా వస్తుంది. మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీచు పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు కలిగే ప్రమాదం ఉంది.
2. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మామిడిపండు హానికరం. నేచురల్ షుగర్ పరిమాణం ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మధుమేహం ఉన్నవారు దీనిని తినే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
3. కొందరికి మామిడిపండు అలర్జీ కావచ్చు. కళ్లలో నీరు కారడం, ముక్కు కారడం, కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. అలాగే, ఈ పండు తరచుగా అజీర్ణం కలిగిస్తుంది, ముఖ్యంగా పచ్చి మామిడిని తీసుకున్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది.
ఇది కూాడా చదవండి: వావ్.. పొద్దున్నే ఖాళీ కడుపుతో ఇదొక్కటి తింటే.. ఏకంగా ఇన్ని లాభాలా..? చర్మం నుంచి కిడ్నీల వరకు..!
4. మామిడి పండ్లను తినడం వల్ల కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. నిజానికి మామిడిలో ఉరుషియోల్ అనే రసాయనం ఉంటుంది.
5. ఈ కాలంలో దొరికే మామిడి పండుని అవసరానికి సరఫరా చేయాలనే మిషతో ఆరోగ్యానికి ఏమాత్రం సురక్షితం కాని, చాలా దేశాల్లో నిషేధించబడిన కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని పండడానికి ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది.
6. ఆర్థరైటిస్ రోగులు మామిడి పండ్లను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అలాగే ఆయుర్వేదం ప్రకారం మామిడిని పాలతో కలిపి తినకూడదు. ఇది మన ఆరోగ్యానికి హానికరం.
మామిడిపండు తిన్నప్పుడు ఈ దుష్ప్రభావాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవడం మంచిది. మామిడి పండ్లను తక్కువ పరిమాణంలో తినాలి. ఏది ఎక్కువైతే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు.
Updated Date - 2023-06-02T16:56:23+05:30 IST