Cool Drinks: మిగిలిపోయిన కూల్‌డ్రింక్స్.. పాడయిపోయిందని మర్నాడు పారబోస్తున్నారా..? దాంతో ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-06-16T11:30:17+05:30
వీటిని తుడుచుకోవడం కష్టంగా ఉంటే వాటిమీద కూల్ డ్రింక్స్ సరిగ్గా పనిచేస్తాయి.
వేసవి రోజుల్లో దాహాన్ని తట్టుకోలేక అందుబాటులో ఉండే శీతల పానీయాలను తాగేస్తూ ఉంటాం. ఇవి మరీ ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాకపోయినా అనేక వ్యాధుల బారిన పడతామని తెలిసినా, వీటిని తాగొద్దని ఎందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నా తాగుతూనే ఉన్నాం. అయితే వీటితో కొన్ని ఉపయోగాలైతే ఉన్నాయి. దాహం తీర్చే పానీయాలుగా మాత్రమే కాకుండా మిగిలిపోయిన డ్రింక్స్‌తో కొన్ని పనులు చేయవచ్చు. ఎప్పుడు తాగడానికి డింక్స్ బాటిల్ తెచ్చుకున్నా అందులో కొంచెం డ్రింక్ మిగులుతుంది. ఎందుకంటే ఒకసారి తెరిచినప్పుడు, దానిలోని గ్యాస్ అయిపోతుంది, దీంతో రుచి లేకుండా మారుతుంది. అందుకే సాధారణంగా మిగిలిపోయిన శీతల పానీయాలను పారేస్తుంటారు. కానీ వాస్తవానికి ఈ శీతల పానీయాలను పారేయడం కాకుండా వీటిని ఇంటి పనులకు ఉపయోగించవచ్చు. అదెలాగంటే..
శుభ్రమైన కారు విండ్‌షీల్డ్
డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు స్పష్టంగా కనిపించేలా కారు విండ్‌షీల్డ్ శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం డబ్బాలో వదిలిన కాస్త డ్రింక్ ఉపయోగించవచ్చు. దీని కోసం, విండ్‌షీల్డ్‌పై అప్లై చేయండి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉంచి, తడి వస్త్రంతో శుభ్రం చేయండి. ఇది విండ్‌షీల్డ్, బంపర్‌లోని బగ్‌లను కూడా సులభంగా తొలగిస్తుంది. కాంతివంతంగా మారుస్తుంది.
ఇది కూడా చదవండి: బెల్లాన్ని కరిగించి.. సూప్‌లా చేసుకుని రోజూ తాగితే జరిగేదేంటి..? అసలు బెల్లాన్ని రోజూ తినొచ్చా..?
నూనె మరకలను తీసేయవచ్చు.
తెల్లని దుస్తుల నుండి మరకలను తొలగించడం చాలా సులభం, కానీ ముదురు రంగు దుస్తుల మరకలు పడితే పోవడానికి చాలా కష్టం అవుతుంది. వీటిని ఈ కూల్ డ్రింక్ సహాయం తీసుకోవచ్చు. ఇది దుస్తుల నుండి నూనె లేదా గ్రీజు మరకలను తొలగించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని కోసం, డ్రింక్‌ను మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దుస్తుల సాధారణంగా ఉతికితే సరిపోతుంది. డిటర్జెంట్‌తో నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేసి ఉతకవచ్చు.
షైన్ టాయిలెట్ సీటు
సాధారణంగా, టాయిలెట్ సీటును శుభ్రం చేయడానికి చాలా ఖరీదైన క్లీనర్లను ఉపయోగించాలి. అటువంటి పరిస్థితిలో, ఫ్రిజ్‌లో ఉంచిన మిగిలిన శీతల పానీయంతో ఈ పని చాలా సులువుగా చేయచ్చు. ఇందుకోసం స్ప్రే బాటిల్‌లో శీతల పానీయాన్ని నింపి చల్లాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత బ్రష్‌తో స్క్రబ్ చేసి ఫ్లష్ చేయాలి. ఇది టాయిలెట్ సీటుకు కొత్తదానిలా మెరుపునిస్తుంది.
తుప్పుని పోగొడుతుంది.
తేమ కారణంగా ఇనుప వస్తువులు తుప్పు పడుతుంటాయి. వీటి మీద ఇంట్లో ఉంచిన డ్రింక్‌ని చల్లి కాసేపు ఆగి శుభ్రం చేయవచ్చు. కాసేపటి తరవాత తుప్పు పట్టిన ప్రదేశంలో మరక పోయే వరకు రుద్దండి. ఇలా శుభ్రం చేస్తే ఇనుప వస్తువులు తుప్పు మరకలు పోయి మెరుస్తూ ఉంటాయి.
నేలను శుభ్రం చేయండి.
కొన్నిసార్లు సిమెంట్ ఫ్లోర్ లేదా టైల్స్‌పై నూనె లేదా గ్రీజు చిందడం వల్ల మరకలు ఏర్పడతాయి, వీటిని తుడుచుకోవడం కష్టంగా ఉంటే వాటిమీద కూల్ డ్రింక్స్ సరిగ్గా పనిచేస్తాయి. వీటిపై శీతల పానీయాన్ని వేసి కాసేపు ఉంచి వదిలివేయండి. తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడవండి. నేల తళతళలాడుతూ మెరుస్తుంది.
Updated Date - 2023-06-16T11:30:17+05:30 IST