Hairfall: జుట్టు రాలిపోతోందని తెగ బాధపడిపోతున్నారా..? తలస్నానానికి అర గంట ముందు దీన్ని రాసుకుంటే..!
ABN, First Publish Date - 2023-09-21T13:03:31+05:30
ఒక పాత్రలో అలోవెరా జెల్‌ను తీసుకుని, అందులో గ్లిజరిన్ కలపాలి. ఈ రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
ఈ రోజుల్లో చాలా మంది జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు నెరసిపోవడం, నిర్జీవంగా ఉండడంతో పాటు వేగంగా జుట్టు రాలడం ఇలాంటి సమస్య ఇప్పుడు అందరిలోనూ, అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. కాలుష్యం, అధిక ఒత్తిడి, సరైన జీవన శైలి లేకపోవడంతో పాటు ఆరోగ్యకరమైన మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు అయితే.. మీరు కూడా ఇలాంటి సమస్యతో సతమతమవుతుంటే, జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, పొడవుగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటే, అది కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోచ్చు. ముఖ సౌందర్యాన్ని పెంచే అలోవెరాలో జుట్టుకు పోషణను అందించే లక్షణాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా జుట్టు ఊడే సమస్యను అలోవెరా పూర్తిగా నయం చేస్తుంది. అదెలాగంటే..
అలోవెరా జుట్టుకు ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే, జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: యాపిల్స్ అంటే యమా ఇష్టమా..? అసలు ఏ టైమ్‌లో తినకూడదో ముందే తెలుసుకోండి..!
జుట్టుకలబందను ఎలా అప్లై చేయాలి (Apply Aloe Vera on Hair)
వెంట్రుకలు రాలే సమస్యకు అలోవెరా హెయిర్ మాస్క్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మాస్క్‌ను తయారు చేయడానికి, ముందుగా ఒక పాత్రలో అలోవెరా జెల్‌ను తీసుకుని, అందులో గ్లిజరిన్ కలపాలి. ఈ రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని కాటన్ సహాయంతో తలపై నుంచి, జుట్టు చివరలను పూర్తిగా అప్లై చేయండి. అరగంట తర్వాత ఆపై తేలికపాటి షాంపూతో, జుట్టును కడగాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల, జుట్టు బలంగా, నల్లగా, ఒత్తుగా తయారవుతుంది.
Updated Date - 2023-09-21T13:03:31+05:30 IST