ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paper Cups: పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగుతున్నారా..? తాజాగా చేసిన ఓ రీసెర్చ్‌లో ఏం తేలిందంటే..!

ABN, First Publish Date - 2023-08-30T12:26:07+05:30

ఈ కప్పులు పర్యావరణానికి చేరుకున్నప్పుడు పూర్తిగా విచ్ఛిన్నం కావు. ప్లాస్టిక్ ప్రకృతిలో ఇలానే కొనసాగితే ..

materials

ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుపుకుంటున్నా, నలుగురు బంధువులు ఇంటికి వస్తున్నారనగానే వెంటనే ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ఫ్లేట్స్ స్పూన్లు ఇలాంటి వాటిని తెచ్చేసి అందులో టిఫిన్స్, టీలు, భోజనాలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు ఇక అవి ఇవి అని ఏం ఉంది అన్నీ కలిపి వచ్చినవాళ్ళకు పెట్టేస్తాం. ఇలా ఎందుకు చేస్తామంటే ఇంట్లో సామాన్లను తీసి కడిగే అవసరం లేకుండా ఇలా డిస్పోజబుల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. అయితే వీటిని వాడేసాకా బయట వేసేస్తూ ఉంటాం. చెత్తలో భాగమైపోయి నేలలో కలిసిపోతాయనే ఆలోచన మనది. కానీ ఇక్కడే మనకు తెలియని చాలా విషయం ఉంది. ప్లాస్టిక్ కప్పుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని వీటికి ప్రత్నామ్నాయంగా పేపర్ ప్లేట్స్ వాడటం సరైనదని పేపరే కదా వాటితో పర్యావరణానికి మేలే జరుగుతుందనే ఆలోచనలోనే చాలా మంది ఉన్నారు కానీ..

పేపర్ కప్పులను ఉపయోగిస్తే, అవి ఆరోగ్యానికి ఖచ్చితంగా సురక్షితమైనవి అని అనుకుంటే, పొరబడినట్లే. నిజానికి పేపర్‌తో చేసిన కప్పులు మట్టిని, ప్రకృతిని కూడా పాడుచేస్తాయన్న విషయం ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్లాస్టిక్ కాలుష్యం అన్ని భాగాలను, అన్ని జీవులను కలుషితం చేస్తుందని ఈ నివేదికలు వెల్లడించాయి..

ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లో ఉపయోగించే పేపర్‌ను ఉపరితల పూతతో ఉన్న ప్లాస్టిక్ చేతిలో ఉన్న కాఫీ నుండి కాగితాన్ని రక్షిస్తుంది. ఈ రోజుల్లో, ప్లాస్టిక్ ఫిల్మ్ తరచుగా పాలీలాక్టైడ్, PLA, బయోప్లాస్టిక్ రకంతో తయారు చేస్తున్నారు. బయోప్లాస్టిక్‌లు మార్కెట్‌లోని 99 శాతం ప్లాస్టిక్‌ ఉంటుంది. ఇక PLA సాధారణంగా మొక్కజొన్న, సరుగుడు, చెరకు నుండి ఉత్పత్తి చేయబడుతుంది.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో వంకాయలు వాడకూడదని ఎందుకంటారు..? ఇంకా ఏఏ కూరగాయలను పక్కన పెట్టాలంటే..!


జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, PLA తరచుగా బయోడిగ్రేడబుల్‌గా పరిగణించబడుతుంది, అంటే ఇది సరైన పరిస్థితుల్లో చమురు ఆధారిత ప్లాస్టిక్‌ల కంటే వేగంగా విచ్ఛిన్నమవుతుంది. కానీ బయోప్లాస్టిక్‌లు నేలలోకి, నీటి మీదకు చేసినప్పుడు మాత్రం వెంటనే భూమిలో కలిసే గుణాన్ని కలిగి ఉండటం లేదు. ఈ కప్పులు పర్యావరణానికి చేరుకున్నప్పుడు పూర్తిగా విచ్ఛిన్నం కావు. ప్లాస్టిక్ ప్రకృతిలో ఇలానే కొనసాగితే ..

ఫలితంగా మైక్రోప్లాస్టిక్‌లను జంతువులు, మానవులు తినే ప్రమాదం ఉంది. ఇతర ప్లాస్టిక్‌ల మాదిరిగానే. బయోప్లాస్టిక్‌లలో సంప్రదాయ ప్లాస్టిక్‌ల రసాయనాలు ఉంటాయి. ఈ ప్లాస్టిక్‌లోని కొన్ని రసాయనాలు విషపూరితమైనవి, పేపర్ ప్యాకేజింగ్ ఇతర పదార్థాలతో పోలిస్తే ఇది ఆరోగ్య ప్రమాదాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. కాబట్టి పేపర్, ప్లాస్టిక్ వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Updated Date - 2023-08-30T12:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising