ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

frozen vegetables: ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని ఎన్ని గంటల్లో తినాలి.. మరీ ఎక్కువ నిల్వచేసి తింటే ప్రమాదమా?

ABN, First Publish Date - 2023-04-18T12:14:40+05:30

కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. పిల్లలకైతే వాంతులు, విరేచనాలు కలుగుతాయి.

freezing
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యం బావుండాలంటే తాజా కూరగాయలు, పళ్లు ఆహారంలో తీసుకోవాలని అందరికీ తెలుసు, మరి తాజా కూరగాయలే తీసుకోవాలనుకున్నా కాసిని ఎక్కువ తెచ్చుకుంటే మాత్రం వాటిలో కొన్నింటిని ఫ్రిజ్ లో నిల్వ ఉండేలా పెట్టుకుని మిగతావి వండుకుంటాం. అయితే ఇలా నిల్వ ఉంచిన ఆహారం ఆరోగ్యానికి మంచిదా? కూరగాయలు, పండ్లు, చికెన్‌, కాటేజ్ చీజ్ వంటి ఆహారాన్ని కొనుగోలు చేసినప్పుడు..ఫ్రిజ్‌లో ఉంచే ముందు వీటిని శుభ్రంగా సరిగ్గా కడగాలి. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే ప్రొటీన్‌ ఆహారం త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాలు, గుడ్లు, చికెన్, చీజ్ వంటి ప్రొటీన్‌ ఆహారం ఎప్పుడూ ఫ్రిజ్‌ పైన ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే ఆహారం తాజాగా ఉంటుంది, దాని పోషక విలువలు అలానే ఉంటాయి.

1. ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో నిల్వ చేసేటప్పుడు ఎప్పుడూ.. సరైన ఉష్ణోగ్రతను సెట్ చేయండి. మాంసం పెట్టేప్పుడు.. 4-5 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.

2. వండిన ఆహారం నిల్వ చేసినప్పుడు.. ఆహారం చల్లారిన తరవాతే ఫ్రిజ్ లో ఉంచాలి. ఉదయం తయారు చేసిన ఆహారాన్ని ఎప్పుడో సాయంత్రం తర్వాత ఫ్రిజ్‌లో పెడతారు. ఇలా చేయకూడదు.

3. ప్రతి వాటినీ ఫ్రిజ్‌ ఖాళీ లేకుండా నింపేస్తే.. దానిలో గాలి ప్రసరణ సరిగ్గా జరగదు. అందులో నిల్వ ఉంచిన ఆహారంలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ఆహారం తింటే డయేరియా, గ్యాస్ట్రే ఇంటెస్టినల్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తక్కువగానే తీసుకోమని నిపుణులు అంటున్నారు.

అన్నం, కూరలను ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలో పోషక విలువలు నశిస్తాయి. చట్నీ, పప్పు, చారు వంటి ఆహార పదార్థాలను వారం రోజుల పాటు ఉంచుకుని తింటారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. మిగిలిపోయిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో మూడు నుండి నాలుగు రోజులు ఉంచవచ్చు. మరీ ఎక్కువకాలం ఉంచి తింటే పోషక విలువలను కోల్పోతుంది.

ఇది కూడా చదవండి: రోజూ అదే సమయానికి ఎవరో లేపినట్టు నిద్ర లేస్తున్నారా? అయితే ఇది అనారోగ్య లక్షణమే..!

అలాగే, ఇది ఫుడ్ పాయిజనింగ్ లేదా అజీర్ణం వంటి కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. వాటిపై బ్యాక్టీరియా ఫామ్‌ అవుతుంది. పైగా అలాంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కడుపు వికారంగా ఉంటుంది. గ్యాస్‌ సమస్యలు వస్తాయి. కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. పిల్లలకైతే వాంతులు, విరేచనాలు కలుగుతాయి.

ఎండాకాలంలో చేసిన ఆహారం త్వరగా పాడైపోకుండా ఉండాలంటే మూడు లేదా నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచినా సరిపోతుంది. ఫ్రిజ్‌ కిందిభాగంలో ఉడికించిన ఆహారం ఉంచుకోవాలి. కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. పండ్లను, పండ్లరసాన్ని ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవాలి. అంతేకానీ ఫ్రిజ్‌లో ఉంచుకోరాదు.

Updated Date - 2023-04-18T12:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising