ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sabudana: సగ్గు బియ్యం చాలా మంచిదనే వాదనలో నిజమెంత..? ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్లు మాత్రం వాడకపోవడమే బెటర్..!

ABN, First Publish Date - 2023-06-22T12:25:17+05:30

సగ్గుబియ్యాన్ని వండే ముందు నానబెట్టి బాగా ఉడికించాలి.

, unsuitable for fasting
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరగా పాయసం చేసేయాలా? కమ్మటి సగ్గు బియ్యం జావా కాస్తున్నారా? సగ్గుబియ్యం సేమ్యా మీ పిల్లలకు ఇష్టమా.. కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు లేనిదే భోజనం సరిగా అనిపించదా.. ఇవే కాదు సగ్గుబియ్యంతో మరెన్నో ఆహార పదార్థాలను చేసుకుని తినడానికి అలవాటు పడ్డాం. ఇవన్నీ చాలా ఈజీగా రుచిగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు చాలా ఇష్టమైన ఆహారం కూడా. అయితే సగ్గుబియ్యాన్ని ఎక్కువగా తీసుకోవచ్చా.. ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుంది అనేది తెలుసుకుందాం.

సగ్గుబియ్యం, వీటిని టేపియోకా ముత్యాలు అని కూడా పిలుస్తారు, ఇది విరివిగా ప్రసిద్ధి చెందిన, ఇష్టపడి తినే ఆహార పదార్థం. ప్రత్యేకించి ఉపవాస సమయంలో దీనిని తీసుకోవడం భారతీయులలో ఉంది. సగ్గుబియ్యం అనేది సాంప్రదాయకంగా ఉపవాస సమయంలో తినే ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం. సగ్గుబియ్యం భారతదేశంలో 1940 నుంచి 1950 లలో ప్రవేశపెట్టబడింది. ఇది తూర్పు లేదా ఆగ్నేయాసియాకు చెందినది. సగ్గుబియ్యాన్ని సాగో అని కూడా పిలుస్తారు, ఇది పిండితో తయారయ్యిన ముత్యాలలా ఉంటుంది. సగ్గుబియ్యం మైదా (10-12 శాతం)తో పోల్చితే చాలా తక్కువ ప్రోటీన్ (0.2 శాతం) కలిగి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా ఒక రకమైన సూపర్‌ఫుడ్‌గా తీసుకుంటూ ఉంటారు.

సగ్గుబియ్యం అనేది కాసావా లేదా సాగో మొక్క మూలాల నుండి తయారు చేసిన పిండి పదార్ధం. మన రక్తంలో చక్కెరను గణనీయంగా పెంచుతుంది. ఇది చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఫుడ్, ఎక్కువ GI ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది, డయాబెటీస్, హైపర్‌టెన్షన్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఇతర జీవక్రియ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రకమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఇది కూడా చదవండి: పొరపాటున చేసిన ఈ ఒక్క మిస్టేక్ వల్లే.. ఏకంగా 7 వేల మంది మధుమేహ బాధితుల ప్రాణాలు పోయాయ్..!

1. జీవక్రియ ఆరోగ్య సమస్యలు లేదా బ్లడ్ షుగర్ నియంత్రణతో సంబంధం ఉన్న ఇతర ఆరోగ్య పరిస్థితులు లేకుంటే, మీరు సమతుల్య ఆహారంలో భాగంగా అప్పుడప్పుడు సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు.

2. సగ్గుబియ్యాన్ని వండే ముందు నానబెట్టి బాగా ఉడికించాలి. వేరుశెనగ, కొబ్బరి వంటి ఇతర పదార్ధాలతో దీన్ని కలిపి వండితే మరింత రుచి వచ్చి చేరుతుంది.

3. ఉపవాస సమయంలో పోషకాహారం కోసం సగ్గుబియ్యాన్ని మాత్రమే తీసుకోవద్దు. ఉపవాసంలో అన్ని పదార్థాలతో కలిపి తినే వీలు చూసుకోవాలి. పండ్లు, రసాలు ఇలా వేటితోనైనా సగ్గుబియ్యాన్ని కలిపి తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని అతిగా తీసుకోకండి, ఎందుకంటే ఇది అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

Updated Date - 2023-06-22T12:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising