Milk: పాలు తాగితే మంచిదే కానీ.. ఈ 7 లక్షణాలు ఉన్నవాళ్లు మాత్రం పొరపాటున కూడా తాగొద్దు..!
ABN, First Publish Date - 2023-07-11T15:55:58+05:30
భోజనం విషయానికి వస్తే పెరుగు, నెయ్యి లేనిదే సుష్టిగా భోజనం చేసినట్టుగా కూడా తృప్తి ఉండదు.
రోజూ ఉదయం పాలు తాగనిదే పిల్లలకు, కాఫీలు, టీలు తాగనిదే పెద్దవారికి రోజు గడవదు. అలాంటి భోజనం విషయానికి వస్తే పెరుగు, నెయ్యి లేనిదే సుష్టిగా భోజనం చేసినట్టుగా కూడా తృప్తి ఉండదు. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నవారు పాలు తాగితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవట. మనం తీసుకునే పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలను తీసుకుంటే ఆరోగ్యాన్ని పెంచుతాయనేది ఒకప్పటి మాట. ఇప్పటి రోజుల్లో దొరికే పాలల్లో పోషకాల కన్నా ఎక్కువగా కెమికల్స్ మాత్రమే ఉంటున్నాయి.
పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తాము. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యం పెంచడం వంటి ప్రయోజనాలుంటాయి. పాలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏ వ్యక్తులు పాలు ఎందుకు తాగకూడదో చూద్దాం.
ఫ్యాటీ లివర్ రోగులు పాలు తాగకూడదు.
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతుంటే పాలు తాగకూడదు. వీరు పాలను తీసుకుంటే ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంటగా మారుతుంది.
లాక్టోస్ అసహనం ఉన్నవారు
లాక్టోస్ అసహనం (Lactose intolerance) ఉన్నవారు అంటే పాలు తాగడంతో పాటు కడుపు ఉబ్బరం, అసిడిటీ, వాంతులు, విరేచనాలు ఉన్నవారు పాలు తాగకూడదు.
పాలు, పెరుగుతో వాంతులు
పాలు, పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత వికారం, వాంతులు ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు.
ఇది కూడా చదవండి: మగాళ్లలో ఈ నాలుగు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. భార్యతో గొడవలు జరుగుతున్నాయనే అర్థం..!
క్యాన్సర్ రోగులు
క్యాన్సర్ ఉన్నవారు ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా, అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు.
అలెర్జీ బాధితులు
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం వస్తున్నా, పాలు తాగడం వల్ల అలర్జీ పెరుగుతుంది. అలాంటివారు పాలు అస్సలు తాగకూడదు.
చర్మవ్యాధులు
ఏవైనా చర్మవ్యాధులు ఉంటే పాలు తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వచ్చే ప్రమాదం ఉన్నవారు పాలు తాగకూడదు.
Updated Date - 2023-07-11T15:55:58+05:30 IST