ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Onions: ఓ వైపు బిర్యానీ తింటూ మరో వైపు ఉల్లిపాయల్ని నంజుకునే అలవాటుందా..? ఈ నిజాలు తెలిస్తే ఇక ముట్టుకోరేమో..!

ABN, First Publish Date - 2023-07-03T16:04:59+05:30

హాలిటోసిస్ పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తీసుకుంటే నోటి దుర్వాసన సమస్య రావచ్చు.

skin and hair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉల్లిపాయ లేని పదార్థం కానీ, ఉల్లి లేని మషాలా కూరగానీ ఉండదు. అసలు తినలేం కూడా. ఇక బిర్యానీ తిన్నప్పడు అయితే అందులో నిమ్మాకాయ ముక్కతో సహా ఇచ్చే చక్రాల్లా కోసిన ఉల్లిపాయ ముక్కల్ని కలిపి తినడం భలే ఎంజాయ్ చేస్తాం. అయితే ఉల్లిపాయలో ఉన్న సుగుణాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. మరీ పచ్చిగా తినడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. పచ్చి ఉల్లిపాయతో కలిగే ఇబ్బందులు ఏమిటంటే..

ఉల్లిపాయ ప్రతికూలతలు..

పచ్చి ఉల్లిపాయ ముక్కలను సలాడ్ రూపంలో తినడం ఆరోగ్యానికి హానికరమట. ఇది అనేక ఇతర సమస్యలకు కారణం అవుతుంది. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే..

చక్కెర స్థాయి..

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అందుకే షుగర్ సమస్య ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: మందుబాబులూ.. మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. ఆల్కహాల్‌లో కూల్ వాటర్ కలిపి తాగే అలవాటుందా..?

పేగులపై ప్రభావం..

పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా సమస్యలు వస్తాయట. ఈ సమస్య వల్ల పేగుల్లో ఇబ్బంది మొదలై కడుపు దెబ్బతింటుంది.

గర్భిణీ స్త్రీలు ఉల్లిపాయలు పచ్చిగా తింటే

గర్భిణీ స్త్రీలు ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోకూడదు. ఈ సమయంలో ఇవి గుండెల్లో మంట, వాంతులు, వికారాన్ని పెంచుతాయి.

మలబద్దకం సమస్య..

ఉల్లిపాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల కడుపునొప్పి, మలబద్దకం వస్తుంది.

హాలిటోసిస్

హాలిటోసిస్ పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తీసుకుంటే నోటి దుర్వాసన సమస్య రావచ్చు.

గుండెల్లో మంట

పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట వస్తుంది. ఉల్లిపాయలో పొటాషియం పాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలోకి వెళ్ళి కార్డియోలివర్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

Updated Date - 2023-07-03T16:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising