ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాతా పొరపాటున కూడా ఈ మూడూ తినకండి..!

ABN, First Publish Date - 2023-05-18T12:35:53+05:30

ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. పుచ్చకాయ తినడం ఎవరికి ఇష్టం ఉండదు?

stomach
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామూలుగా పుచ్చకాయలు వేసవిలో మంచి ఆహారం. దీనితో వేసవి వేడినే కాదు. ఆరోగ్యాన్నీ పొందవచ్చు. కానీ పుచ్చకాయ తిన్న తరువాత కొంత సమయం వరకూ మరే ఆహారం తీసుకోకపోవడం మంచిది. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. పుచ్చకాయ తినడం ఎవరికి ఇష్టం ఉండదు? మనలో చాలామంది వయసు భేదం లేకుండా అన్ని వయసుల వారూ తింటారు. వేసవి కాలంలో ఇది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అయినప్పటికీ, పొరపాట్ల కారణంగా, మనం అప్పుడప్పుడు అవస్తలు పడుతూ ఉంటాం. నిజానికి, పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపుకు ఇబ్బంది కలగవచ్చు. దానిలోని అన్ని ప్రయోజనాలను పొందలేకవచ్చు. కాబట్టి, పుచ్చకాయ తిన్న తర్వాత ఏమి తినకూడదో చూడండి.

1. పుచ్చకాయ తిన్న తర్వాత పాలకు దూరంగా ఉండండి.

పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తీసుకోవడం ఆరోగ్యపరంగా అనేక విధాలుగా హానికరం. వాస్తవానికి, పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. దాని తర్వాత పాల ఉత్పత్తులను తిన్నప్పుడు, ఉబ్బరం కలిగి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. అజీర్ణానికి కారణమవుతుంది.

2. పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్ ఫుడ్స్

పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది. నిజానికి, పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కొంత పిండిపదార్థం కూడా ఉంటుంది. అటువంటప్పుడు, పప్పులు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. కడుపుకు హానికరం.

ఇది కూడా చదవండి: రోజుకు ఒక పండైనా తింటున్నారా ? లేదా ? కొంపదీసి తినడం లేదా..?

3. పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు

పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు తినడం వల్ల అనేక పొట్ట సమస్యలు వస్తాయి. వాస్తవానికి, ప్రోటీన్‌తో పాటు, గుడ్లలో ఒమేగా-3 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పుచ్చకాయ నీరు అధికంగా ఉండే పండు. అటువంటి పరిస్థితిలో, ఈ రెండూ కలిసి ఒకదానికొకటి జీర్ణం కాకుండా అడ్డుపడతాయి. ఇవి కడుపులో ఉబ్బరం, మలబద్ధకం కూడా కలిగిస్తాయి.

కాబట్టి, పుచ్చకాయ తిన్న తర్వాత ఈ ఆహారాలను తీసుకోకుండా ఉండండి. ఇది కాకుండా, పుచ్చకాయ తిన్నప్పుడల్లా, దాదాపు 30 నిమిషాల వరకు ఏమీ తినకూడదు. దానిలోని పోషకాలను శరీరం గ్రహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పొరపాటున కూడా పుచ్చకాయ తరువాత మరే ఆహారాన్నీ ఇవ్వకూడదు.

Updated Date - 2023-05-18T12:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising