ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

leftover food: సగం తిని విడిచిపెట్టిన ఆహారం తినొచ్చా?.. ఆయుర్వేదం చెప్పే విషయం ఇదే..

ABN, First Publish Date - 2023-04-24T15:14:39+05:30

the food to avoid any development of bacteria తాజాగా తయారు చేసిన ఆహారాన్ని 3 గంటలలోపు తీసుకోవడం మంచిది.

qualities of food.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్త అన్నం మిగిలిందనుకోండి. పాతకాలంలో గెంజిలో పోసి కాస్త మజ్జిగ కలిపి ఉంచి ఉదయాన్నే చద్దన్నంగా పెట్టేవారు. ఇప్పుడో అన్నం, కూరల్లాంటివి మిగిలితే వాటిని ఫ్రిజ్లో ఉంచి ఉదయం కాస్త వేడి చేసి తింటారు. అసలు అలా తినచ్చా? మిగిలిపోయిన ఆహారాన్ని తినాలా లేక మానుకోవాలా అనేది చాలాకాలంగా చర్చనీయాంశమైంది! ఆహారాన్ని సరైన పద్ధతిలో వేడి చేయడం వల్ల ఆహారం తాజాదనాన్ని, రుచిని నిలుపుకుంటుంది. మరోవైపు, పాత ఆహారం అనారోగ్యాలకు దారితీస్తుందని ఆయుర్వేదం నమ్ముతుంది. మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకుంటే అసలు ఏమి జరుగుతుంది?

నిపుణులు ఏమంటున్నారు..

సైన్స్ ప్రకారం, ఆహారాన్ని 15 సెకన్ల పాటు 165 ° F ఉష్ణోగ్రత వద్ద మళ్లీ వేడి చేయడం వలన మిగిలిపోయిన వాటిలో వ్యాధికారక, బ్యాక్టీరియాను చంపవచ్చు.ఆహారాన్ని లోపల తిరిగి వేడి చేయడం వల్ల బ్యాక్టీరియాను చంపడం మాత్రమే కాదు, అదే సమయంలో తాజాదనాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. కానీ ఆయుర్వేదం ప్రకారం మూడు గంటల తర్వాత వండిన ఆహారాన్ని తినడం ఆహారంలోని పోషక లక్షణాలను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.

ఆయుర్వేదం ప్రకారం, తాజాగా వండిన ఆహారాన్ని వండిన 3 గంటలలోపు తినాలి. అయితే, మిగిలిపోయిన ఆహారం తినడం సాధారణ వ్యవహారం అయితే, 24 గంటల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉన్న పాత ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది.

ఇది కూడా చదవండి : వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఒక్క రెబ్బ తీసుకుంటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

మిగిలిపోయిన ఆహారం తింటే ఏమి జరుగుతుంది?

మిగిలిపోయిన ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలను పెంచుతుంది. దీర్ఘకాలంలో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది పేగు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

మిగిలిపోయిన ఆహారానికి సరైన మార్గం

ఆయుర్వేదం ప్రకారం, ఆహారాన్ని చల్లబరచడం, మళ్లీ వేడి చేయడం ద్వారా ఆహారంలోని పోషక విలువలను తగ్గించవచ్చని నమ్ముతారు. కాబట్టి, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని 3 గంటలలోపు తీసుకోవడం మంచిది. తాజాగా వండిన ఆహారం ప్రాణాన్ని పోషిస్తుందని, జఠరాగ్ని (జీర్ణ అగ్ని)ని పెంచుతుందని నమ్ముతారు. తాజాగా వండిన ఆహారాన్ని నిల్వ ఉంచడం, అధిక ఉష్ణోగ్రత వద్ద మళ్లీ వేడి చేయడం వల్ల అది తినేందుకు సరైనదేనని నిర్థారించుకుని తీసుకోవాలి., అయితే వీలైతే పాత ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది.

Updated Date - 2023-04-24T15:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising