Banana Peel: వేస్ట్ అంటూ పారేసే అరటి తొక్కలతోనే చర్మాన్ని అందంగా మార్చే టెక్నిక్.. తెలియక చెత్త బుట్టలో వేసేస్తున్నారు కానీ..!
ABN, First Publish Date - 2023-08-12T08:50:30+05:30
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అరటి తొక్కలు వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
అరటిపండ్లు, అరటి తొక్కలు రెండూ వాటి పక్వత స్థాయిని బట్టి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అరటిపండ్లు జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంలో మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు, అయితే పండిన, నల్లబడిన అరటిపండ్లు తెల్ల రక్తకణాలు వ్యాధి, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అరటి తొక్కతో చర్మాన్ని యవ్వనంగా మార్చుకోండి, వీటితో 5 అద్భుత ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
1. అరటి తొక్కలు..
అరటిపండు లోపలి భాగం కాకుండా మెత్తగా, తీపిగా ఉంటుంది, అరటి తొక్క గట్టిగా, చేదుగా ఉంటుంది. అరటిపండు ఎంత పక్వానికి వస్తే, పై తొక్క అంత తియ్యగా, మెత్తగా ఉంటుంది. అరటి పండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుతో సహా అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ముఖాన్ని యవ్వనంగా మార్చే పనిలో ముఖ్యంగా... ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
2. అరటి తొక్కలతో అద్బుత ప్రయోజనాలు..
అరటి తొక్కలు కూడా అనేక అధ్యయనాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నట్టు కనుగొనబడింది. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అరటి తొక్క సహజమైన మ్యాజిక్‌గా ఉపయోగపడతాయి. వీటితో ప్రయోజనాలు ఏంటంటే...
చర్మం మాయిశ్చరైజింగ్
అరటి తొక్కలు సహజ తేమను ఇస్తాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. తొక్కను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
ఇది కూడా చదవండి: రాత్రిళ్లు పెరుగన్నం తినడం మంచిదా..? కాదా..? ఆయుర్వేదంలో ఉన్న నిజాలివీ..!
మృదువైన ఎక్స్ఫోలియేషన్..
అరటి తొక్కలు సేంద్రీయ ఎక్స్ ఫోలియేటింగ్ ను అందిస్తాయి. మృత చర్మాన్ని సున్నితంగా తొలగించి కొత్త చర్మాన్ని ఇస్తుంది. దీని వల్ల వెల్వెట్ స్కిన్ సొంతం అవుతుంది.
మొటిమలను తొలగిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్న అరటి తొక్కలు మొటిమల సమస్యను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. అరటి తొక్క లోపలి భాగాన్ని అప్లై చేయడం వల్ల మంట తగ్గుతుంది.
చర్మం
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అరటి తొక్కలు వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ముడతలను తొలగిస్తుంది.
మంచి బూస్టర్
అరటి తొక్కలో ఉండే ఎంజైమ్‌లు అసమాన స్కిన్‌టోన్, హైపర్ పిగ్మెంటేషన్‌తో ఒక ప్రకాశవంతమైన రంగును పొందవచ్చు.
Updated Date - 2023-08-12T08:50:30+05:30 IST