Hair Fall: జుట్టు రాలుతోందా..? ఎన్నో మెడిసిన్స్‌ను వాడుంటారు.. ఒక్కసారి వంటింట్లో ఉండే కరివేపాకుతో ఇలా ట్రై చేసి చూడండి..!
ABN, First Publish Date - 2023-10-10T16:09:48+05:30
15 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి. వారానికి రెండు, మూడు రోజులు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.
కరివేపాకును మన భారతీయ వంటల్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. కరివేపాకులోని గుణాలు ఆహారంగానే కాకుండాఅది మన జుట్టు పెరిగేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా మార్చుతాయి.
జుట్టు సమస్యలకు మార్కెట్ల నుండి కొనుగోలు చేసే ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారు చేసుకోగల కరివేపాకు హెయిర్ ప్యాక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఉంటాయి. కరివేపాకు ఆకులు దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి. పాడైన, చిట్లిన జుట్టును తొలగించడం, జుట్టు రాలడాన్ని నివారించడం వరకు అనేక ప్రయోజనాలన్నాయి.
కరివేపాకులోని విటమిన్ బి జుట్టు మూలాలను పోషణ, బలోపేతం చేయడం, జుట్టు రంగును పెంటడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: మంచినీళ్ల కోసం ఇళ్లల్లో బాటిల్స్‌ను వాడుతున్నారా..? అయితే ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సిందే..!
జుట్టు పెరుగుదలకు కరివేపాకును ఎలా ఉపయోగించాలి.
పెరుగు, కరివేపాకుతో మాస్క్ సిద్ధం చేయడానికి, ముందుగా కొన్ని కరివేపాకులను తీసుకొని వాటిని మందపాటి పేస్ట్‌గా రుబ్బుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పెరుగులో గుప్పేడు కరివేపాకు ఆకులను వేసి పేస్ట్ చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని జుట్టుకు పట్టించండి. 15 నిమిషాల తర్వాత షాంపూ ఉపయోగించి కడగాలి. వారానికి రెండు, మూడు రోజులు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.
కరివేపాకు పేస్ట్, కొన్ని మెంతులు పేస్ట్ మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని జుట్టుకు పట్టించండి. 20 నిమిషాల తరువాత, షాంపూతో జుట్టును కడగాలి. కరివేపాకులో విటమిన్ బి ఉంటుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
Updated Date - 2023-10-10T16:09:48+05:30 IST