Tea: పొరపాటున కూడా టీ తాగేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు.. వీటిని కలుపుకుని తింటే..!
ABN, First Publish Date - 2023-08-28T14:20:57+05:30
టీ తాగిన తర్వాత నిమ్మరసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి టీతో నిమ్మరసం తీసుకోవడం వల్ల టీ మరింత ఆమ్లంగా మారుతుంది
చాలామంది తమ రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. టీ అంటే చాలా ఇష్టంతో తెల్లవారగానే ఒకటి రెండు కప్పులు తాగేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో టీతోపాటు, పకోడీలు, బిస్కెట్స్ కూడా లాగించేస్తూ ఉంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఏయే పదార్థాలు టీతో పాటు తినకూడదో చూద్దాం.
పాలకూర వడలు
బచ్చలి వడలను టీతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజానికి బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇక టీలో టానిన్లు, ఆక్సలేట్ సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి శరీరంలో ఇనుము శోషణను నిరోధిస్తాయి. కాబట్టి టీతో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినకూడదు.
బిస్కెట్లు
టీతో బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు, కానీ ఈ ఆహార కలయిక ప్రేగు ఆరోగ్యానికి హానికరం. నిజానికి బిస్కెట్లు మైదా, పంచదార కలిపి తయారుచేస్తారు. టీలో అదనంగా పంచదార, మైదా తీసుకోవడం కడుపుకు మంచిది కాదు. దీని కారణంగా, మలబద్ధకం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలను కలిగవచ్చు.
ఇది కూడా చదవండి: 30 ఏళ్ల వయసు దాటిన వెంటనే.. తప్పకుండా చేయించుకోవాల్సిన 5 టెస్టులు ఇవే..!
నిమ్మరసం తీసుకోకూడదు.
టీ తాగిన తర్వాత నిమ్మరసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి టీతో నిమ్మరసం తీసుకోవడం వల్ల టీ మరింత ఆమ్లంగా మారుతుంది, ఇది ఎసిడిటీ, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
టీ తర్వాత నీరు త్రాగవద్దు..
టీ తర్వాత వెంటనే నీరు త్రాగకూడదు. ఐస్ క్రీం వంటి చల్లటి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు, దాని వల్ల జీర్ణవ్యవస్థ పాడైపోయి కడుపు సమస్యలు మొదలవుతాయి.
Updated Date - 2023-08-28T14:20:57+05:30 IST