Health Insurance: 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లాభమా..? నష్టమా..?
ABN, First Publish Date - 2023-09-26T15:55:44+05:30
అనవసరమైన ఆర్థిక ఒత్తిడి లేకుండా అవసరమైన సంరక్షణను బీమా సంస్థలు అందజేస్తాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ.. శరీరంలో వచ్చే అనేక మార్పులతో పాటు వ్యాధుల బారిన పడే అవకాశాలూ అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా జీవన శైలి వ్యాధులు ఇటీవల కాలంలో ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నాయి. 30 ఏళ్లు దాటితే చాలు.. బీపీ, మధుమేహం వంటి వ్యాధులు సర్వసాధారణం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే చిన్న వయసులోనే గుండె, మూత్రపిండాలు దెబ్బతింటున్న వారినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలను ఎంపిక చేసుకునేటప్పుడు గతంతో పోలిస్తే ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లాభమా..? నష్టమా..? అనేది తెలుసుకుందాం.
ఎప్పుడు తీసుకోవాలి?
చాలా వరకూ ఈ బీమాకు సంబంధించి కొన్ని అపోహలు లేకపోలేదు.. ఇందులో ముఖ్యంగా మేం ఆరోగ్యంగానే ఉన్నాం.. ఇప్పుడే వైద్య బీమా పాలసీతో ఏం అవసరం అన్న ప్రశ్న వేస్తుంటారు. అనారోగ్యం ఎప్పుడూ చెప్పిరాదు. ఆసుపత్రిలో చేరిన తర్వాత చికిత్స కోసం ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. అందుకే, వీలైనంత చిన్న వయసులో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచిది. 30 ఏళ్లలోపు పాలసీ తీసుకోవడం మర్చిపోకూడదు.
అన్నింటికీ వర్తించేలా..
సరైన సమయంలో సరైన పాలసీని తీసుకోవడం ఎప్పుడూ మంచిది. తీసుకోవాలనుకునే పాలసీ నిబంధనలు ఒకటికి రెండుసార్లు చూసుకోండి. ఎలాంటి పరిమితులు, ఉప పరిమితులు ఉండకుండా పాలసీ చికిత్స ఖర్చును చెల్లించాలి. కొన్ని పాలసీలు ఆసుపత్రి గది అద్దె, ఐసీయూ, శస్త్ర చికిత్సలకు పాలసీ మొత్తంలో నిర్ణీత శాతాన్ని మాత్రమే చెల్లిస్తామని అంటుంటాయి. ఇలాంటి వాటి జోలికి వెళ్లకూడదు. క్లెయిం చేయని ఏడాదిలో 'నో-క్లెయిం' బోనస్ వర్తించేలా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి : ఈ 9 రకాల కూరగాయలను తింటుంటారు కానీ.. ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మందికి తెలియదు..!
తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించబడినా, ప్రత్యేక సంరక్షణ కోసం మరొక ఆసుపత్రికి బదిలీ చేయబడినా, మద్దతుగా అంబులెన్స్ కవరేజ్ రూపొందించబడింది. నెట్‌వర్క్, నాన్-నెట్‌వర్క్ ప్రొవైడర్‌ల ఆధారంగా ఛార్జీలు మారవచ్చు, అనవసరమైన ఆర్థిక ఒత్తిడి లేకుండా అవసరమైన సంరక్షణను బీమా సంస్థలు అందజేస్తాయి.
ఆసుపత్రిలో చేరకముందు, ఇంటికి వెళ్లాక కొన్ని రోజులపాటు అయిన ఖర్చులను చెల్లించేలా పాలసీ ఉండాలి. ఆధునిక వైద్య విధానాలకూ పరిహారం లభించాలి. విదేశాల్లో చికిత్స చేయించుకునే వెసులుబాటూ ఉండాలి. నెట్‌వర్క్ ఆసుపత్రులు అధికంగా ఉండే పాలసీకి ప్రాధాన్యం ఇవ్వాలి.
Updated Date - 2023-09-26T15:55:44+05:30 IST