ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Arab Countries: గల్ఫ్ దేశాల్లోనే ఎందుకీ వింత పరిణామం.. అరబ్ దేశాల్లో మగాళ్ల కంటే మహిళలకే ఎందుకీ సమస్య అంటే..!

ABN, First Publish Date - 2023-06-22T13:57:35+05:30

అయితే ఉత్తర ఆఫ్రికాలో పురుషులు, స్త్రీల మధ్య ఊబకాయంలో అత్యధిక తేడాలు ఉన్నాయి.

gain weight
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊబకాయం ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. అయితే ఇందులో ఫురుషులతో పోల్చితే మహిళలే ముందు స్థానంలో ఉన్నారట. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మంది స్త్రీలు, 11 శాతం మంది పురుషులకు ఊబకాయం సమస్య, అంటే వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఊబకాయంలో ఈ వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా మారుతూ వస్తుంది. అయితే ఉత్తర ఆఫ్రికాలో పురుషులు, స్త్రీల మధ్య ఊబకాయంలో అత్యధిక తేడాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని అనేక దేశాల్లో ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.

ఇరాన్‌లోని బాగ్దాద్‌లో నివసించే జైనాబ్ బరువు 120 కిలోలు. ఆమె నలుగురు కూతుళ్లలో ఎవరూ పని చేయడం లేదు. వారు బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. కూతుళ్లను పనికి పంపడం వల్ల మగవారి వేధింపులకు గురవుతారని జైనాబ్ భయపడుతోంది. అందుకే వారిని బయటకు పంపే ఆలోచన లేదు.

జైనాబ్ కూతుళ్లు ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తుంటారు. తననే కాదు. అరబ్ దేశాల్లో చాలామంది ఆడవారు నడకకు కూడా వెళ్ళకపోవడం, ఆహారంలో సరైన పరిమితులు లేకపోవడం వంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి మగవారికంటే ఆడవారు బరువు పెరిగేందుకు ప్రధాన కారణంగా మారింది. ఒక్క అక్కడనే కాదు ప్రపంచం మొత్తం అలానే ఉంది పరిస్థితి. ఉదయం నిద్ర లేచి మంచం మీద నుండి కాలు క్రింద పెట్టినప్పటి నుండి తిరిగి రాత్రి మంచం మీదకి చేరేంతవరకు నిత్యజీవితంలో మనిషికి కావలసిన అన్ని విషయాలలోను సౌకర్యాలు పెరిగినాయి. మనిషి చేసే ప్రతి పనిని మర యంత్రాలు పూర్తి చేస్తున్నాయి. వంట ఇంట్లో రుబ్బుకునే, దంచుకునే పనిలేకుండా గ్రైండర్లు, మిక్సీలొచ్చాయి. బట్టలు ఉతకాల్సిన పని లేకుండా వాషింగ్ మిషన్ల ద్వారా పనులు జరిగిపోతున్నాయి.

ఇది కూడా చదవండి: పొరపాటున చేసిన ఈ ఒక్క మిస్టేక్ వల్లే.. ఏకంగా 7 వేల మంది మధుమేహ బాధితుల ప్రాణాలు పోయాయ్..!

ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్ళడానికి నడవాల్సిన పనిలేకుండా రకరకాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా మన నిత్యజీవితంలో అన్ని పనులు ఏ ఇబ్బందీ లేకుండా, శరీరంతో పని లేకుండా కేవలం వ్రేళ్ళను మీటుతూ క్షణాల్లో పనులన్నీ చకచకా జరిగేటట్లు చేస్తున్నాం.ఇక మగవారు తీసుకునే ఆహారం, పని చేసే విధానం ఆడవారితో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువుతగ్గాలని అప్పటికప్పుడు అనుకుని చేసే ప్రయత్నాలన్నీ ఇబ్బందులనే తెచ్చిపెడతాయి.

వృత్తి, వ్యాపారం, బంధువుల దృష్ట్యా అలవాట్లను సడలిస్తూ, మెల్ల మెల్లగా పాత అలవాట్లలోకి తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ తినడం మొదలు పెడతారు. నెమ్మదిగా వ్యాయామాలు ఆపివేస్తారు. దీని పరిణామం 3 నుంచి 4 నెలల్లో ఎంతో కష్టపడి, కఠోర దీక్షతో ఎంతో డబ్బు ఖర్చు చేసి తగ్గించుకున్న బరువు యథావిధిగా మళ్ళీ పెరగడం మొదలౌతుంది. 2 నుంచి 3 నెలల్లో తగ్గిన పాత బరువును తిరిగి చేరుకుంటారు. ఒక్కోసారి కోల్పోయిన బరువు కన్నా అధిక బరువు పెరుగుతారు.

Updated Date - 2023-06-22T13:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising