ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snacks Time: పొరపాటున కూడా స్నాక్స్‌ను ఈ టైమ్ తర్వాత అస్సలు తినొద్దు.. శాస్త్రవేత్తలే ఎందుకిలా చెప్పారంటే..!

ABN, First Publish Date - 2023-07-11T12:23:48+05:30

రాత్రిపూట స్నాక్స్‌లో బార్లీ లడ్డూను కూడా చేర్చవచ్చు.

calcium
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరుతిళ్ళు అంటే ఒకప్పుడు జంతికలు, చక్కిలాలని, గవ్వలని, ఇలా ఇంటిపట్టున తయారు చేసినవి మాత్రమే తినేవారు. అదీ పండగలకు, పెళ్ళిళ్ళకు తప్పితే మామూలు రోజుల్లో పెద్దగా ఈ చిరుతిళ్ళు ఉండేది తక్కువే. అయితే ఇప్పుడు రోజులో భోజనాలతో పాటుగా చిరుతిళ్ళు కూడా ఉండాల్సిందే అన్నట్టుగా మన ఆహార పద్దతులు మారాయి. ప్రస్తుతం రోజుల్లో మార్కెట్‌లో దొరికే చాలా రకాల చిరుతిళ్ళకు అలవాటు పడ్డారు. కొన్ని ప్యాక్ చేసి ఉన్న చిరుతిళ్ళు రోజులో ఆఫీసుల్లో, స్కూళ్ళకు వెళ్ళే బాక్సుల్లో, సులభంగా చేరిపోయాయి స్నాక్స్. సాయంకాలం పూట చిరు ఆకలిని తీర్చే స్నాక్స్‌కి అలవాటు పడిపోయారు అయితే వీటిని రాత్రి పూట తినచ్చా.. అసలు ఎప్పుడు తీసుకోవాలి.

చిరుతిళ్లు తినడానికి సమయం: మన జీవనశైలి చాలా మారింది, భోజనం కంటే కన్నా కూడా చిరుతిళ్లపై ఆధారపడి ఉంటున్నారు. చాలా సార్లు ఆహారానికి బదులుగా స్నాక్స్ మాత్రమే తింటున్నవారున్నారు. రాత్రిపూట పని చేస్తూ, టైంపాస్ చేసేందుకు స్నాక్స్ తింటారు. చిప్స్, లడ్డూలు, బిస్కెట్స్ వంటి స్నాక్స్ భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చిరుతిళ్లు. అయితే ఇప్పుడు ఈ చిరుతిళ్లన్నీ తినకూడదని న్యూట్రిషన్ సైంటిస్ట్ చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు, అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. దానికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారుచేసుకున్న చిరుతిళ్ళను రాత్రిపూట ఆకలిగా ఉన్నప్పుడు తినగలిగే కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఈ సమయం తర్వాత స్నాక్స్ తినవద్దు.

మనం తినే ప్యాకింగ్ స్నాక్స్ చాలావరకు ప్రాసెస్ చేయబడినవే. అనారోగ్యకరమైనవి అని డాక్టర్స్ చెబుతున్నా కూడా సాయంత్రం 6 గంటల తర్వాత లేదా రాత్రి 9 గంటల తర్వాత వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. వీటికి బదులు ఆరోగ్యకరమైన చిరుతిండిని రాత్రిపూట తీసుకుంటే..

ఇది కూడా చదవండి: మందులూ అక్కర్లేదు.. డైటింగూ అవసరం లేదు.. మంచి నీళ్లల్లో వీటిని కలుపుకుని రోజూ తాగితే..!

మిల్లెట్లు

రాగులు, జొన్నలు, మిల్లెట్ వంటి ఉబ్బిన మిల్లెట్‌లను రాత్రిపూట తినవచ్చని వైద్య పోషకాహార నిపుణుల మాట. ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ ఫైబర్, కాల్షియం అందిస్తాయి. వీటిని వేయించి తినవచ్చు.

ఫాక్స్ నట్

మఖానా తక్కువ కొవ్వు ఆహారం, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫైబర్ ఉంటాయి. వీటిని సమతుల్య పరిమాణంలో తినవచ్చు. అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, వేపిన పప్పు తినవచ్చు. ఇది తక్కువ కేలరీల ఆహారం, ఇందులో ఇనుము, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ప్రోటీన్లను కూడా ఉన్నాయి. ఈ దేశీ స్నాక్ రక్తపోటు, బ్లడ్ షుగర్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది.

బార్లీ లడ్డూలు

రాత్రిపూట స్నాక్స్‌లో బార్లీ లడ్డూను కూడా చేర్చవచ్చు. రాత్రిపూట ఒకటి రెండు లడ్డూలు తింటే ఆకలి తీరుతుంది. దీని ప్రభావం శరీరం మీద చల్లగా ఉంటుంది. బార్లీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

Updated Date - 2023-07-11T12:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising