ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ugadi: ఉగాది రోజున ఇలాంటి పనులు చేస్తే ఇక సంవత్సరం అంతా అదోగతే.. !

ABN, First Publish Date - 2023-03-21T10:43:38+05:30

ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.

Yugadi or Ugadi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఆరోజున ఏడు రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసుకుని జీవితంలో వచ్చే అటుపోట్లను తీపి, చేదు, పులుపు, కారం ఇలా అన్ని రుచులతోనూ మేళవించి తినడం అనేది మన సంస్కృతిలో భాగంగా వస్తున్న ఆచారం. ఉగాది రోజున ముఖ్యంగా ఏ పనులైతే చేస్తామో అదే పనిని సంవత్సరం అంతా చేస్తామని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈరోజున ఏ పనులు చేయాలి..అస్సలు చేయకూడని పనులేంటంటే..

ఈరోజున తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటాం. ఆదాయ వ్యయాలు, తెలుసుకుని జాగ్రత్తపడాలనుకుంటాం. అంతేకాదు ఈ రోజున విసన కర్రలను దానం చేస్తే మంచి మేలు జరుగుతాయి.

ఇది కూడా చదవండి: ఉగాది రోజు రావి ఆకుతో ఇంట్లో దీపం పెడితే.. ఏమవుతుందో తెలుసా..!

వాటిని దానం చేస్తే పుణ్యం కలుగుతుందని చెబుతారు. అలాగే ఉగాది నుంచి పౌర్ణమి వరకు దేవతారాధన చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి. చైత్ర శుక్ల పాడ్యమి దినాన బ్రహ్మను పూజిస్తే.. శివుడిని విదియ దినాన నిష్టగా పూజించాలి. అలాగే గౌరీ శంకరుడిని తదియ రోజున, వినాయకుడిని చుతుర్థి రోజున ఇలా పౌర్ణమి వరకు నిష్టగా దేవతారాధన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

ఈ పనులు చేయకూడదు.

ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. బద్దకంగా ఉండకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలను చేయకూడదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు అంగాలు కలిగిన కాలజ్ఞానాన్నే పంచాంగం అంటారు. దక్షిణం ముఖంగా కూర్చుని ఈరోజున పంచాంగ శ్రవణాన్ని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట.

Updated Date - 2023-03-21T10:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising