ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OHRK Director Gopichand Malineni : సక్సెస్‌ బ్యాగేజీని వదిలేసి... ఖాళీ బ్యాగ్‌తో బయల్దేరాలి

ABN, First Publish Date - 2023-01-23T02:20:51+05:30

తను బిబిఎమ్‌ చదివింది. ఉద్యోగం చేస్తోంది. ఒక రోజు పెద్దమ్మ గుడి దగ్గర తనని చూశాను. చూడగానే నాకు నచ్చేసింది. ఎవరు, ఎక్కడివారని ఆరా తీస్తే వాళ్లది ఏలూరు అని తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కష్టాన్ని నమ్ముకుని... స్వయంకృషితో ఎదిగిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఇంటర్‌తోనే చదువుకు బ్రేక్‌ వేసినా... ఆ తరువాత ‘క్రాక్‌’లాంటి బ్లాక్‌బస్టర్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మొదలుపెట్టి... హీరోలు మెచ్చిన డైరెక్టర్‌ అనిపించుకున్నారు. ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన... ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఎన్నో సంగతులు పంచుకున్నారు.

ఆర్కే: హలో గోపీ! ఎలా ఉన్నావ్‌? ‘వీరసింహారెడ్డి’ సక్సె్‌సను ఎంజాయ్‌ చేస్తున్నట్టేనా? సక్సెస్‌ అని చెప్పవచ్చా?

గోపి: హండ్రెడ్‌ పర్సెంట్‌!

ఆర్కే: ఇద్దరు హేమాహేమీలు చిరంజీవి, బాలకృష్ట పోటీ పడ్డారు కదా? మరి మధ్యలో డైరెక్టర్లు శాండ్‌విచ్‌ కాలేదా?

గోపి: లేదండీ. షూట్‌ మొదలైన ఫస్ట్‌ డే నుంచి మేమెంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా ప్రొడ్యూసర్లు కూడా రెండు ప్రాజెక్టుల మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకే సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చినా, రెండూ బ్లాక్‌బస్టర్లు అవుతాయనే నమ్మకం ఉండేది.

ఆర్కే: పెద్ద హీరోతో సినిమా అనగానే టెన్షన్‌ పడలేదా?

గోపి: నన్ను నేను నిరూపించుకునే సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. రవిగారితో చేసిన మూడు సినిమాలు హిట్లే. ‘క్రాక్‌’ బ్లాక్‌బస్టర్‌. సరైన సమయంలో బాలకృష్ణగారి సినిమా నా దగ్గరకు వచ్చింది.

ఆర్కే: ఈ అవకాశం ఎలా వచ్చింది?

గోపి: ‘క్రాక్‌’ షూటింగ్‌ 80 శాతం పూర్తయింది. తర్వాత పాండమిక్‌ వచ్చింది. అక్టోబర్‌, నవంబరు వరకూ షూటింగులన్నీ ఆగిపోయాయి. ఆ గ్యాప్‌లో రెండు స్ర్కిప్ట్‌లు రెడీ చేసుకున్నాను. దాన్లో ఒకటి బాలకృష్ణ గారితో. రెండోది పవన్‌ కల్యాణ్‌ గారితో చేద్దాం అనుకున్నా. నవంబర్‌లో షూటింగ్‌లు మళ్లీ మొదలైనప్పుడు ‘క్రాక్‌’ సినిమాకు సంబంధించి 20 రోజుల షూటింగే బ్యాలెన్స్‌ ఉంది. డిసెంబరు 20న మైత్రి నవీన్‌ గారు ఫోన్‌ చేసి కలుద్దామన్నారు. వెళితే... ఆయన బాలయ్య గారితో సినిమా చేద్దాం అనుకుంటున్న విషయం చెప్పారు. నా మనసులో కూడా అదే ఉంది. అలా ‘క్రాక్‌’కు ముందే నన్ను నమ్మి బాలయ్య బాబు గారితో సినిమాను ఫిక్స్‌ చేసేశారు. ఆ తర్వాత పది రోజుల్లో నవీన్‌ గారు, నేను, మైత్రి రవిగారు... బాలకృష్ణ గారిని కలవడం, ఐదు నిమిషాల్లో ఓకే అయిపోవడం జరిగిపోయాయి.

ఆర్కే: పెద్ద హీరోలతో తీసినప్పుడు, తేడా కొట్టి సినిమా పోతే, బలైపోయేది డైరెక్టరే కదా?

గోపి: డైరెక్టర్‌కు ప్రతి సినిమా ఫస్ట్‌ సినిమానే! సక్సెస్‌ అనేది 15 రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి నెక్స్ట్‌ సినిమా గురించే ఆలోచిస్తాం. అలా తర్వాతి పరీక్షకు ప్రిపేర్‌ అవుతూ ఉండవలసిందే! కాబట్టి ప్రతి సినిమానూ మొదటి సినిమానే భావిస్తూ, వెనకున్న సక్సెస్‌ బ్యాగేజీని అక్కడే వదిలేసి, ఖాళీ బ్యాగుతో బయల్దేరాలి.

ఆర్కే: భిన్న నేపథ్యం ఉన్నవాళ్ల రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్‌ అయ్యాయి. సోషల్‌ మీడియా కులపరంగా హీరోలను వెనకేసుకురావడం, ఆ ముసుగులో వేరే పార్టీ సోషల్‌ మీడియావాళ్లు ఎంటరై, అగ్నికి ఆజ్యం పోశారు. ఆ పరిస్థితి చూసి మీకెలా అనిపించింది?

గోపి: ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరా మొబైల్‌, ట్విట్టర్‌ అకౌంట్స్‌ ఉంటున్నాయి. ఎవరికి నచ్చిన ఒపీనియన్‌ను వాళ్లు చెప్పేస్తున్నారు.

ఆర్కే: జెన్యూన్‌ ఒపీనియన్‌ అయితే ఒక పద్ధతి. కానీ పర్వర్టెడ్‌ ఒపీనియన్లు ఉంటున్నాయి కదా!

గోపి: మనకు నచ్చనివాడి మీద కామెంట్‌ పెట్టడానికే ఫోన్‌ను ఉపయోగించడం మొదలైంది. ఆ ప్రెజర్‌ మా అందరి మీదా ఉంటుంది. దీని గురించి మనం చేయగలిగేదేమీ లేదు. అయితే మంచి సినిమా తీస్తే ఆడియన్స్‌ కచ్చితంగా ఆదరిస్తారు.

ఆర్కే: మీరు ఇంటర్‌ కూడా పూర్తి చేయలేదట కదా?

గోపి: అవునండీ. టెన్త్‌ వరకూ మంచి స్టూడెంట్‌నే! ఒంగోలు దగ్గర ఒక కాన్వెంట్‌లో చదివాను. ఇంటర్‌మీడియెట్‌ నెల్లూరులోని వి.ఆర్‌.కాలేజీ. కరెక్టుగా కాంపౌండ్‌కు ఆనుకునే మూడు థియేటర్లు ఉండేవి. అలా ఫస్టియర్‌లోనే సబ్జెక్టులు ఉండిపోయాయి. సెకండియర్‌ కూడా అదే పరిస్థితి. దాంతో ఇంటర్‌ డిస్‌కంటిన్యూ చేశాను.

ఆర్కే: మీది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కదా?

గోపి: అవును. నేను విలేజ్‌లోనే పెరిగాను. మా నాన్నకి సినిమా పిచ్చి ఉండేది. అప్పట్లో కొన్ని సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ కొని, బాగా నష్టపోయారు. దాంతో మా కుటుంబం మధ్యతరగతి నుంచి దిగువ తరగతికి దిగజారింది.

ఆర్కే: చాలా కష్టాలు పడి ఉంటారుగా?

గోపి: కష్టమని అనిపించలేదు. నేను చేసిన శ్రీహరి గారి సినిమాలు మూడు, నాలుగు నెలల్లో పూర్తయిపోతూ ఉండేవి. 48 రోజుల్లో షూటింగ్‌ పూర్తయిన సందర్భాలూ ఉన్నాయి. అలా పనిలో రాటుదేలిపోయాను. శ్రీరామ్‌ గారు మా బాబాయి. ‘ఈనాడు’, ‘ఎబిఎన్‌’లో చేశారు. ఆయనవల్ల నాకు తిండి సమస్య ఉండేది కాదు. నాకు పెళ్లయ్యేవరకూ వాళ్లతోనే ఉన్నా.

ఆర్కే: మిమ్మల్ని ఈ స్థాయిలో చూసి మీ నాన్న ఎలా ఫీలవుతున్నారు?

గోపి: మా నాన్న ‘క్రాక్‌’కు ముందు చనిపోయారు. నా కెరీర్‌లో పెద్ద సక్సెస్‌ ఆ సినిమా. దాన్ని ఆయన చూడలేకపోయారు. ఆయనకు డ్రింకింగ్‌ అలవాటు ఉండేది. అప్పులు చేసి ఫ్రెండ్స్‌కు పార్టీలు ఇచ్చేవారు. అప్పు తీర్చడం కోసం పొలం రాసిచ్చేసేవారు. నాకు ఊహ తెలిసేసరికే 40 ఎకరాలు 4 ఎకరాలకు వచ్చేశాయి.

ఆర్కే: మీకు మొదట డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిందెవరు?

గోపి: మురుగదా్‌సతో ‘స్టాలిన్‌’ చేయడం నాకు టర్నింగ్‌ పాయింట్‌. నా హార్డ్‌వర్క్‌ చూసిన చిరంజీవిగారు నేను కచ్చితంగా డైరెక్టర్‌ను అవుతానని ప్రోత్సహించారు. నా పుట్టినరోజునాడు అరవింద్‌ గారు, చిరంజీవి గారు షూటింగ్‌ స్పాట్‌కు వచ్చి, ఒక వాచ్‌ తెప్పించి, గిఫ్ట్‌ ఇస్తూ.. ‘ఈ రోజు నుంచి నీ టైమ్‌ బాగుంటుంది’ అన్నారు. ఆ తర్వాత ఎన్‌టిఆర్‌ గారితో ‘కంత్రీ’ చేశాను. అసోసియేట్‌గా నేను చేసిన చివరి సినిమా ‘బిల్లా’. ఆ సమయంలో ప్రభాస్‌ గారు... ‘నాకు కథ చెప్పు. నీ డైరెక్షన్‌లో సినిమా చేస్తా’ అన్నారు. అప్పుడు ‘డాన్‌ శీను’ ఐదు నిమిషాలు చెప్పాను. ‘బాగుంది డార్లింగ్‌... చేద్దాం’ అన్నారు. తర్వాత ఆయన ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమా చేశారు. గోపీచంద్‌ గారు కూడా కథ పట్ల ఆసక్తి కనబరిచారు. ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజుగారు. గోపీచంద్‌ మా బ్యానర్‌లోనే చేయాలని అనుకోవడం, ఈ మధ్యలో కథ గురించి రవితేజ గారికి తెలియడం జరిగిపోయింది. ఆయన ఓకే అనడంతో అలా నాకు మొదటి అవకాశం వచ్చింది.

ఆర్కే: సినిమా టిక్కెట్‌ రేట్ల విషయంలో చిరంజీవి సినిమాకు 25 రూపాయలు, బాలకృష్ణ సినిమాకు 20 రూపాయలు పెంచుకోడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. అప్పుడు మీకేం అనిపించలేదా?

గోపి: ఏ ప్రభుత్వం లెక్కలు వాళ్లకుంటాయి. మా నిర్మాతలకు ఏపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలున్నాయి. సినిమాకు అయిన బడ్జెట్‌ను బట్టి టిక్కెట్‌ ధరలను నిర్ణయించారు.

ఆర్కే: సినిమాలో పొలిటికల్‌ డైలాగ్‌లు ఎవరు పెట్టారు?

గోపి: దీన్లో ఇంటెన్షనల్‌గా డైలాగ్‌లు పెట్టలేదు. కథతో పాటే డైలాగ్స్‌ ఉంటాయి. అయితే ఎవరికివాళ్లు, తమకు తగ్గట్టుగా ఊహించుకున్నారు.

ఆర్కే: ‘క్రాక్‌’ సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ ఇప్పటికీ ఒంగోలులో బతికే ఉన్నాడా?

గోపి: రౌడీయిజం మానేసి, ఒంగోలు మార్కెట్‌ యార్డులో ఉల్లిపాయల కొట్టు పెట్టుకుని, సాధు జీవితాన్ని గడుపుతున్నాడు. 1980, 85ల్లో ఆయన మీద 20 దాకా మర్డర్‌ కేసులు ఉండేవి. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించి వచ్చాడు. లైఫ్‌ పడినవి కూడా క్షమాభిక్షతో శిక్ష తగ్గి, బయటకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడాయన వయసు 70 పైన ఉండవచ్చు. సినిమా స్ర్కిప్ట్‌ తయారు చేసుకుంటున్నప్పుడు ఆయనను కలిసి, ఒంగోలులో జరిగిన సంఘటనల్లో ఆయన పాత్ర గురించి తెలుసుకున్నాను.

ఆర్కే: గాడిద రక్తం తాగే ఆచారం నిజంగానే ఉందా?

గోపి: ఉంది. స్టువర్ట్‌పురం దొంగలు, కబడ్డీ ఆడేవాళ్లు ఒళ్లు బలంగా తయారవడం కోసం తాగి పరిగెత్తేవాళ్లు.

ఆర్కే: ‘క్రాక్‌’ హిట్‌ అయినా నిర్మాతలు మీకు డబ్బులు సరిగా ఇవ్వలేదట కదా?

గోపి: ఆయనకు అంతకు ముందరి సినిమాల అప్పులున్నాయి. అవన్నీ ఈ సక్సెస్‌ మీద పడ్డాయి. 75 లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదు. అయుతే ఆ ఇంపాక్ట్‌ నా మీద పడకుండా చూసుకున్నాను.

ఆర్కే: మీకు బెటర్‌ క్రిటిక్‌ ఎవరు?

గోపి: మా ఆవిడే బెటర్‌ క్రిటిక్‌. అలాగే మా ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌, కథ చెప్పగానే చెప్పేస్తాడు.

ఆర్కే: డబ్బు లేక ఎవరి ముందైనా చేయి చాచారా?

గోపి: ‘విన్నర్‌’కు, ‘క్రాక్‌’కు మధ్యలో చాలా స్ట్రగుల్‌ అయ్యాను. ఆ స్ట్రగుల్‌ పీరియడ్‌ను జీవితంలో మర్చిపోలేను. అలా ఒకటిన్నర ఏడాది పాటు ఇబ్బందులు పడ్డాను. ఏ హిట్‌ సినిమాకూ నాకు పూర్తి రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు. నా జీవిత కాలంలో పూర్తి రెమ్యునరేషన్‌ వచ్చింది ‘వీరసింహారెడ్డికే’! ఇప్పుడు డబ్బు వ్యవహారాల కోసం ఒక మనిషిని పెట్టుకున్నాను.

ఆర్కే: ఆ టైంలో మీ భార్య ఇబ్బంది పడలేదా?

గోపి: నా పెళ్లైన తర్వాత విడుదలైన ‘బలుపు’ సక్సెస్‌ అయింది. కాబట్టి మా ఆవిడకు ఆ మచ్చ రాలేదు. పైగా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆవిడ నన్ను అర్థం చేసుకుని సపోర్ట్‌గా ఉంది. అత్తింటి వారి హెల్ప్‌ నేను అడగలేదు.

ఆర్కే: మీ అన్నదమ్ములు ఎంతమంది?

గోపి: ఇద్దరం. అన్నయ్య, నేను. అన్నయ్య ఒంగోలు ‘ఆంధ్రజ్యోతి’లో స్టోర్‌ ఇన్‌చార్జిగా చేస్తున్నాడు.

ఆర్కే: గోపీచంద్‌ మార్కు మంచి స్టోరీలతో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్యూ వెరీమచ్‌.

గోపి: థ్యాంక్యూ.

ఆర్కే: మీ పెళ్లి కూడా సినిమాటిక్‌గానే అయిందటగా?

గోపి: తను బిబిఎమ్‌ చదివింది. ఉద్యోగం చేస్తోంది. ఒక రోజు పెద్దమ్మ గుడి దగ్గర తనని చూశాను. చూడగానే నాకు నచ్చేసింది. ఎవరు, ఎక్కడివారని ఆరా తీస్తే వాళ్లది ఏలూరు అని తెలిసింది. డిస్ట్రిబ్యూటర్‌ ఎల్వీఆర్‌ గారి ద్వారా ఎంక్వయిరీ చేస్తే, వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. తర్వాత నా గురించి ఎంక్వయిరీ చేసుకుని చివరకు ఒప్పుకున్నారు.

Updated Date - 2023-01-23T03:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising