ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vinayaka Chavithi 2023: శ్రీగణనాథం భజామ్యహం!.. నీలాపనిందలు రాకుండా పోవాలంటే...

ABN, First Publish Date - 2023-09-18T00:01:48+05:30

శ్రీగణనాథుడి పూజలో ప్రకృతి సిద్ధమైన పత్రాలకే ప్రాధాన్యం. భక్తిగా, శ్రద్ధగా కాస్తంత గరికతో పూజించినా సంతుష్టుడై...

శ్రీగణనాథుడి పూజలో ప్రకృతి సిద్ధమైన పత్రాలకే ప్రాధాన్యం. భక్తిగా, శ్రద్ధగా కాస్తంత

గరికతో పూజించినా సంతుష్టుడై... కొండంత వరాలిచ్చే స్వామి విఘ్నేశ్వరుడు.

గణేశ చతుర్థి నాడు ఆయన పూజలో వినియోగించే 21 రకాల (ఏకవింశతి పత్రాలు)

ఆకులలో ఓషధీ లక్షణాలు అపారం. అందుకే వినాయక చమితి పూజ

గణేశుడి అనుగ్రహాన్నే కాదు... ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుందన్నారు పెద్దలు.

ఈ శ్లోకం చదవండి

సింహః ప్రసేన మవధీత్‌

సింహో జాంబవతా హతః

సుకుమారక మారోది

తవ హ్యేషః శ్యమంతకః

‘‘ప్రసేనుణ్ణి సింహం చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ బిడ్డా! ఏడవకు. ఈ శ్యమంతకమణి నీదే!’’ అని అర్థం. ఈ శ్లోకాన్ని చదివి, వినాయక వ్రత కథాక్షతలు వేసుకుంటే నీలాపనిందలు రాకుండా ఉంటాయనేది పెద్దల మాట.

గణపతి పూజా ఫలం

విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఉన్నత

విద్య లభిస్తుంది. సంపద

అమితంగా చేకూరుతుంది. సద్గుణసంపన్నులైన సంతానం కలుగుతుంది. పునరావృతరహితమైన మోక్షం కలుగుతుంది. జీవితం ఆనందప్రదంగా సాగుతుంది.

ఇది గణపతి పూజా ఫలం.

ఎలాంటి విగ్రహాన్ని పూజించాలి?

విగ్రహం డొల్లగా ఉండకూడదు. కాబట్టి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారి్‌సతో అచ్చులు పోసి తయారుచేసిన విగ్రహాలు పూజకు పనికిరావు.

విగ్రహం వెండిదైనా, బంగారంతో తయారు చేసిందైనా డొల్లగా ఉంటే అలంకరణకే తప్ప పూజకు పనికిరాదు.

విగ్రహం ఆకారాన్ని బట్టి పూజ, సంకల్పం, నివేదన, అన్నదానం, సంతర్పణ చేయాలి.

గణపతిని గూర్చి మనం ఏ శక్తిని ఆశిస్తూ పూజ చేస్తున్నామో ఆ శక్తి అందాలంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజ చేయాలి.

ఓం సుముఖాయనమః

మాచీపత్రం పూజయామి

మాచీ పత్రం (మాచి పత్రి)

ఆర్త్‌మీసియా వల్గారిస్‌- మంచి

సువాసన గల పత్రి. తలనొప్పులు,

కంటి దోషాలు తగ్గుతాయి.

ఓం గణాధిపాయ నమః

బృహతీపత్రం పూజయామి

బృహతీ పత్రం (వాకుడు)

దగ్గు, ఉబ్బసం, నంజు, గొంతు,

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.

ఓం ఉమాపుత్రాయనమః

బిల్వపత్రం పూజయామి

బిల్వ పత్రం(మారేడు)

ఈ వృక్షం బహు ప్రయోజనకారి.

ఆకు పసరు పలు చర్మ దోషాలను

నివారిస్తుంది.

ఓం గజాననాయనమః

దుర్వాయుగ్మం పూజయామి

దుర్వాయుగ్మం (గరిక)

రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలకు పనిచేస్తుంది.

ఓం హరసూనవేనమః

దత్తూర పత్రం పూజయామి

దత్తూర పత్రం (ఉమ్మెత్త)

ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతములకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాటులకు విషహరిణిగా పనిచేస్తుంది.

ఓం లంబోదరాయనమః

బదరీపత్రం పూజయామి

బదరీ పత్రం (రేగు)

అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.

ఓం గుహాగ్రజాయనమః

అపామార్గ పత్రం పూజయామి

అపామార్గ పత్రం (ఉత్తరేణి)

గాయాలను మాన్చటంలో, ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

ఓం గజకర్ణాయనమః

తులసీపత్రం పూజయామి

తులసీ పత్రం (తులసి)

దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులు నివారిస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది.

ఓం ఏకదంతాయ నమః

చూతపత్రం పూజయామి

చూత పత్రం (మామిడి ఆకు)

మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఓం వికటాయ నమః

కరవీర పత్రం పూజయామి

కరవీర పత్రం (గన్నేరు)

తలలో చుండ్రును తగ్గిస్తుంది. ఈ మొక్క విషతుల్యం కాబట్టి దీని వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఓం భిన్న దంతాయ నమః

విష్ణుక్రాంత పత్రం పూజయామి

విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)

దీర్ఘకాలికంగా బాధిస్తున్న దగ్గును, కఫాన్ని, వివిధ రకాల వాతాలను, విష జ్వరాలను సమర్థవంతంగా నివారిస్తుంది.

ఓం వటవే నమః

దాడిమీ పత్రం పూజయామి

దాడిమీ పత్రం (దానిమ్మ)

శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది.

ఓం సర్వేశ్వరాయ నమః

దేవదారు పత్రం పూజయామి

దేవదారు పత్రం (దేవదారు)

దేవదారు తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి, లైంగిక ఉత్ర్పేరణకు ఉపయుక్తంగా ఉంటుంది.

ఓం ఫాలచంద్రాయ నమః

మరువకపత్రం పూజయామి

మరువక పత్రం (మరువం)

నరాల ఉతే్త్ప్రరణకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగ పడుతుంది.

ఓం హేరంభాయ నమః

సింధువార పత్రం పూజయామి

సింధువార పత్రం (వావిలి)

వాతం, శరీరం, తలమాడు నొప్పిలను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.

ఓం శూర్పకర్ణాయనమః

జాజీపత్రం పూజయామి

జాజీ పత్రం (జాజి ఆకు)

ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి శక్తిని కల్పిస్తాయి. వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

ఓం సురాగ్రజాయ నమః

గండకీ పత్రం పూజయామి

గండకీ పత్రం (దేవకాంచనం)

కడుపులో నులిపురుగులను హరిస్తుంది.

ఓం ఇభవకా్త్రయ నమః

శమీపత్రం పూజయామి

శమీ పత్రం (జమ్మి ఆకు)

ఈ ఆకురసం మాడుకి చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టు పైనుంచి వీచే గాలి స్వచ్ఛంగా, ఆహ్లాదంగాను ఉంచుతుంది.

ఓం వినాయకాయ నమః

అశ్వత్థపత్రం పూజయామి

అశ్వత్థ పత్రం (రావి ఆకు)

శరీరంలో విషాల విరుగుడుకు, క్రిము లను నివారించడానికి వినియోగిస్తారు.

ఓం సుర సేవితాయ నమః

అర్జున పత్రం పూజయామి

అర్జున పత్రం (తెల్ల మద్ది)

దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి పనిచేస్తుంది.

ఓం కపిలాయ నమః

అర్కపత్రం పూజయామి

అర్క పత్రం (తెల్ల జిల్లేడు)

తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతివంతం చేస్తాయి.

నిమజ్జనం ఎందుకంటే...

వినాయకుడి పూజ చేశాక కచ్చితంగా నిమజ్జనం చేస్తాం. ఇలా నిమజ్జనం చేయకుండా ఉండకూడదా? అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. శాస్త్ర ప్రకారం 365 రోజులు ఇంట్లో ఉంచి పూజ చేయని విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేయాలి. నిమజ్జనాన్ని నీళ్లలోను, మట్టిలోను చేయవచ్చు. నీళ్ల సౌకర్యం లేనప్పుడు విగ్రహాలను పొలాల్లో వేయొచ్చు. ధాన్యపు గాదెల్లో దాచొచ్చు. వడ్లన్నీ అయిపోయాక విగ్రహం బయటపడుతుంది కదా! అప్పుడు దాన్ని తీసుకెళ్లి పొట్లపాదుల్లో ఉంచుతారు. వానాకాలం కాబట్టి వర్షం కురిసినప్పుడు పాదులోని మట్టిలో విగ్రహం కూడా కరిగి కలిసిపోతుంది.

Updated Date - 2023-09-18T09:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising