కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahesh Babu: మహేశ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే!

ABN, First Publish Date - 2023-07-30T02:24:01+05:30

ఆగస్టు 9... మహేశ్‌ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌ నుంచి ఆయన అభిమానుల కోసం చాలా గిఫ్టులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు.

Mahesh Babu: మహేశ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే!

ఆగస్టు 9... మహేశ్‌ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌ నుంచి ఆయన అభిమానుల కోసం చాలా గిఫ్టులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఈ చిత్రం నుంచి ఓ గ్లింప్స్‌ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు విడుదల చేసిన ప్రచార చిత్రం మాస్‌ని అలరించేలా తీర్చిద్దారు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇష్టపడేలా ఈ టీజర్‌ రాబోతోందట. ‘గుంటూరు కారం’ పూర్తయిన వెంటనే, రాజమౌళితో సినిమా పట్టాలెక్కబోతోంది. ఆ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ పుట్టిన రోజున వదిలే అవకాశం ఉంది. మరోవైపు... రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగిస్తూ, మహేశ్‌ నటించిన ‘బిజినె్‌సమెన్‌’ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘పోకిరి’ తరవాత మహేశ్‌, పూరి కాంబోలో రూపొందించిన చిత్రమిది. మహేశ్‌ క్యారెక్టరైజేషన్‌, తన సంభాషణలు ఆయన అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. బాక్సాఫీసు దగ్గర సైతం ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. గతంలో మహేశ్‌ చిత్రాలు ‘పోకిరి’, ‘ఒక్కడు’ రీ రిలీజ్‌ రూపంలో వచ్చి భారీ వసూళ్లు అందుకొన్నాయి. ఈసారి ‘బిజినె్‌సమెన్‌’ కూడా ఆకర్షణీయమైన వసూళ్లు అందుకొనే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2023-07-30T02:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising