ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE visa reforms: ఇకపై యూఏఈలోకి ఎంట్రీ చాలా ఈజీ.. అమల్లోకి కొత్తగా 11 ఎంట్రీ పర్మిట్స్..!

ABN, First Publish Date - 2023-04-15T17:24:24+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి. అయితే, అమలులో ఉన్న ఈ వీసాలకు కొన్ని మార్పులు చేసింది. ఇప్పటికే ప్రవాసులకు దీర్ఘకాలికి రెసిడెన్సీ కోసం అమలు చేస్తున్న గోల్డెన్ వీసా పథకాన్ని(Golden Visa scheme) అక్కడి ప్రభుత్వం విస్తరించింది. అలాగే గ్రీన్ రెసిడెన్సీ (Green residency) పేరిట ఐదేళ్ల కాలానికి కొత్త వీసా తీసుకొచ్చింది. దీంతో పాటు మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా (Multiple Entry Tourist Visa), ఉద్యోగార్థుల కోసం ఉద్యోగ అన్వేషణ ఎంట్రీ పర్మిట్ వంటి పలు రకాల వీసాలు ప్రకటించింది. ఇవన్నీ కూడా తాజాగా అమల్లోకి వచ్చేశాయి.

* గోల్డెన్ వీసా: యూఏఈ అనేక రకాల ప్రొఫెషనల్ కేటగిరీలు మరియు దీర్ఘకాల ప్రాతిపదికన దేశంలోని అత్యుత్తమ జీవన నాణ్యతను ఆస్వాదించే పెట్టుబడిదారుల కోసం ఈ గోల్డెన్ వీసాలను (Golden Visas) ప్రకటించింది. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తుంది. ఈ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.

* జాబ్ వీసా: యూఏఈలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ఉద్యోగార్ధులు ఈ కొత్త జాబ్ వీసా (Job visa)ను పొందవచ్చు. ఈ వీసాకు స్పాన్సర్ గానీ, హోస్ట్ గానీ అవసరం. ఇది బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్‌లకు, ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్‌లతో పాటు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ విభజించిన మొదటి, రెండవ, మూడవ నైపుణ్య కేటగిరీల కిందకు వచ్చే వారికి మంజూరు చేయబడుతుంది.

* బిజినెస్ వీసా: పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేకుండానే బిజినెస్ వీసా (Business visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా కావాల్సింది డిపాజిట్స్ మాత్రమే.

Best Countries for Expats: ప్రవాసులకు అన్ని విధాల బెస్ట్ దేశం ఏదో తెలుసా..?


* చదువు/శిక్షణ కోసం వీసా: ఈ వీసా శిక్షణ, పరిశోధన కోర్సులు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు హాజరు కావాలనుకునే వ్యక్తులు లేదా విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఈ వీసాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా మరియు పరిశోధనా సంస్థలు స్పాన్సర్ చేసే వెసులుబాటు ఉంది. దీనికి అధ్యయనం లేదా శిక్షణ లేదా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, దాని వ్యవధి వివరాలను స్పష్టం చేస్తూ సంబంధిత సంస్థ నుండి తీసుకున్న లేఖ సమర్పించాల్సి ఉంటుంది.

* బంధువులు/స్నేహితులను సందర్శించడానికి వీసా: ఒక విదేశీయుడు యూఏఈలో పౌరుడు/నివాసి స్నేహితుడు లేదా బంధువు అయితే ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేదు.

* తాత్కాలిక వర్క్ వీసా: ప్రొబేషన్ టెస్టింగ్, ప్రాజెక్ట్ ఆధారిత పని వంటి తాత్కాలిక వర్క్ అసైన్‌మెంట్ ఉన్నవారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్థులు తాత్కాలిక పని ఒప్పంద పత్రాన్ని లేదా యజమాని నుండి ఒక లేఖ, ఫిట్‌నెస్ ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

* మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా: ఐదేళ్ల కాలపరిమితో ఇచ్చే ఈ మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా (Multi-entry tourist visa)కు స్పాన్సర్ అవసరం లేదు. అలాగే 90 రోజుల వరకు యూఏఈలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. మరో 90 రోజుల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇలా ఓ వ్యక్తి ఈ వీసాతో ఆ దేశంలో 180 రోజులు ఉండొచ్చు. అయితే, దరఖాస్తుదారుడు దరఖాస్తు చేయడానికి ముందు గత ఆరు నెలల్లో తప్పనిసరిగా 4వేల డాలర్లు(రూ.3.16లక్షలు) లేదా విదేశీ కరెన్సీలలో దానికి సమానమైన బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.

అమెరికాలో ఇద్దరు తెలుగు చిన్నారులకు అరుదైన గౌరవం

* ఫ్యామిలీ వీసా: గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లలోపు మాత్రమే స్పాన్సర్ చేసే వీలు ఉండేది. తాజాగా తీసుకువస్తున్న ఈ ఫ్యామిలీ వీసా (Family visa)ద్వారా ఇప్పుడు మగ పిల్లలను 25 సంవత్సరాల వయస్సు వరకు స్పాన్సర్ చేయవచ్చు. వికలాంగ పిల్లలు కూడా ప్రత్యేక అనుమతిని పొందుతారు. అవివాహిత కుమార్తెలకు తల్లిదండ్రులు నిరవధిక సమయం వరకు స్పాన్సర్ చేయవచ్చు.

* గ్రీన్ వీసా: ఐదేళ్ల వ్యవధితో వచ్చే గ్రీన్ వీసా (Green visa) ద్వారా వీసాదారులు తమ కుటుంబ సభ్యులను స్పాన్సర్ లేదా యజమాని లేకుండా తీసుకురావడానికి అనుమతిస్తుంది. ఈ వీసా నైపుణ్యం కలిగిన కార్మికులు, స్వీయ-యజమానులు, ఫ్రీలాన్సర్లు మొదలైన వారికి వర్తిస్తుంది.

* ట్రాన్సిట్ వీసా: యూఏఈ ప్రభుత్వం రెండు రకాల ట్రాన్సిట్ వీసాలను జారీ చేస్తుంది. అందులో ఒకటి ఎలాంటి ఫీజులేని 48 గంటల వాలిడిటీ గలది. మరోకటి 96 గంటల వ్యవధితో ఇస్తుంది. దీనికి 50 దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీసాను యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు జారీ చేస్తాయి. దీనికి ఎలాంటి పొడిగింపు ఉండదు.

* జీసీసీ రెసిడెంట్స్ ఇ-వీసా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల పౌరులు, వారి కుటుంబ సభ్యులకు ఈ వీసాను ఇవ్వడం జరుగుతుంది. మూడు నెలల వ్యవధితో దీన్ని జారీ చేస్తారు. అయితే, జీసీసీ పౌరుల పాస్‌పోర్ట్ అనేది మూడు నెలలకు తగ్గకుండా వాలిడిటీని కలిగి ఉండాలి.

*దౌత్య వ్యవహారాల వీసా: ఈ ప్రవేశ అనుమతి దౌత్య, ప్రత్యేక, యునైటెడ్ నేషన్స్ (UN) పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారి కోసం. దేశం వెలుపల ఉన్న యూఏఈ (UAE) రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల ద్వారా దీనిని జారీ చేయవచ్చు.

UK: భారతీయ నర్సులకు బ్రిటన్ తీపి కబురు.. వచ్చే నాలుగేళ్లలో భారీ రిక్రూట్‌మెంట్‌.. మనోళ్లకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి!


Updated Date - 2023-04-15T17:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising