NRI Death Mystery: ఆచారం ప్రకారం పూడ్చకుండా తండ్రి శవాన్ని కాల్చడంపై కొడుక్కు డౌట్.. కేసు పెడితే 11 నెలల తర్వాత..
ABN, First Publish Date - 2023-02-17T21:51:03+05:30
తమ ఆచారం ప్రకారం తండ్రిని పూడ్చకుండా ఎందుకు దహనం చేశారని ఆ కుమారుడు సందేహించాడు. తన తండ్రిని ఆయన రెండో భార్యే హత్య చేసిందంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఎన్నారై డెస్క్: తన తండ్రి శవాన్నీ పూడ్చకుండా దహనం చేయడంపై ఓ కొడుక్కు అనుమానం కలిగింది. తండ్రి రెండో భార్య అసాధారణ రీతిలో ఆయన అంత్యక్రియలు ఎందుకు జరపాల్సి వచ్చిందో ఆలోచించేకొద్దీ అతడిలో సందేహాలు బలపడ్డాయి. దీంతో.. అతడు పోలీసులను ఆశ్రయించాడు. అతడి తండ్రి మరణించిన 11 నెలల తర్వాత ఈ కేసులో దర్యాప్తు ప్రారంభమైంది(Probe launched).
కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగపూర్(Singapore) పౌరుడైన నందన్ సింగ్ సాయిన్(NRI) గతేడాది 2022 క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన మొదటి భార్యకు విడాకులిచ్చాక రెండో కమల్‌ప్రీత్ కౌర్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. తమ ఆచారం ప్రకారం నందన్ సింగ్‌ను ఖననం చేయకుండా దహనం చేయడంతో మొదటి భార్య కొడుకు అశ్విన్ నందన్ సింగ్‌కు అనుమానం వచ్చింది. దీంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని కమల్ ప్రీత్ సింగ్, ఆమె తల్లిదండ్రులు హత్య చేశాడని(Murder allegations) ఆరోపించారు. సాక్ష్యాలన్నీ రూపుమాపేందుకే తండ్రి శవాన్ని దహనం చేశారని చెప్పారు.
తండ్రి మరణం తరువాత..ఆయన బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేయకుండా నగదును విత్‌డ్రా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి నుంచి విడిపోయాక ఆయన కమల్‌ప్రీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నట్టు తెలిపారు. క్యాన్సర్ బారిన పడ్డ తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించిన కమల్‌ప్రీత్..ఆ తరువాతవ్యాధి ముదరడంతో వైద్యుల సలహాకాదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తరువాత ఫోర్జరీ వీలునామాను సృష్టించి తండ్రి పేరిట ఉన్న అకౌంట్‌లోని 15 లక్షలను తీసేసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా.. నందన్ సింగ్ పేరిట ఉన్న ఆస్తిని నకిలీ డాక్యుమెంట్‌తో కమల్‌ప్రీత్ తన పేరిట మార్చుకుందని కూడా ఆరోపించారు. గతేడాది జూన్‌లో ఆయన ఫిర్యాదు చేయగా.. పోలీసులు కమల్‌ప్రీత్ కౌర్, ఆమె తల్లిదండ్రులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Updated Date - 2023-02-17T21:54:39+05:30 IST