Saudi Arabia: సౌదీ అరేబియా ఉక్కుపాదం.. వారంలోనే 15వేల మంది అరెస్ట్!
ABN, First Publish Date - 2023-01-02T10:32:02+05:30
చట్టాలు అతిక్రమించిన వారిపై సౌదీ అరేబియా(Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిని భారీ స్థాయిలో సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని..
ఎన్నారై డెస్క్: చట్టాలు అతిక్రమించిన వారిపై సౌదీ అరేబియా(Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిని భారీ స్థాయిలో సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని సెక్యూరిటీ అధికారులు, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్టు అధికారులు సంయుక్తంగా దేశ వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 22-28 మధ్య చట్టాలు ఉల్లంఘించిన 15,328 మందిని అరెస్ట్ చేశారు.
అరస్టైన వారిలో 8,808 మంది రెసిడెన్సీ నిబంధనలను(Residence violators)4,038 మంది బార్డర్ సెక్యూరిటీ చట్టాలను(Border security), 2482 మంది లేబర్ చట్టాల(Labor violators)ను అతిక్రమించినట్టు సౌదీ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన మరో 552 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ పౌరులను కూడా అధికారులు హెచ్చరించారు. ఎవరైనా చట్టాలను అతిక్రమించిన వారికి సహకరించి, వసతి ఏర్పాటు చేస్తే వారిపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Updated Date - 2023-01-02T10:32:57+05:30 IST