ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో కాల్ సెంటర్ స్కామ్.. భారతీయుడికి జైలు శిక్ష

ABN, First Publish Date - 2023-01-05T20:08:01+05:30

అమెరికా కాల్ సెంటర్ స్కామ్‌లో దోషిగా తేలిన ఓ భారతీయుడికి స్థానిక కోర్టు 29 నెలల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా కాల్ సెంటర్ స్కామ్‌లో(Call Center Scam) దోషిగా తేలిన ఓ భారతీయుడికి స్థానిక కోర్టు 29 నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడు మోయిన్ ఇడ్రిస్‌భాయ్ తప్పు చేశానని అంగీకరించడంతో కోర్టు అతడి తాజాగా శిక్షను ఖరారు చేసింది. బాధితులను నుంచి దోచుకున్న డబ్బును ఇండియాలోని నిందితులకు బదిలీ చేయడంలో మోయిన్ కీలక పాత్ర పోషించాడని యూఎస్ అటార్నీ మీడియాతో పేర్కొన్నారు. మోయిన్ 6325103 డాలర్లను బాధితులకు పరిహారంగా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌లో మొయిన్ రన్నర్‌గా వ్యవహరించేవాడు. తొలుత కాల్ సెంటర్ నిర్వహకులు అమెరికన్లకు ఫోన్లు చేసి వారిపై కేంద్ర దర్యాప్తు ప్రారంభమైదంటూ బెదిరించే వారు. డబ్బును చెల్లిస్తే సమస్య నుంచి బయటపడొచ్చని నమ్మబలికేవారు. దీంతో..బాధితులు డబ్బును నిందితులు కోరిన చోటికి పార్శెల్ చేశారు. ఆ తరువాత మొయిన్ నకిలీ ఐడీ కార్డులతో పార్శెల్‌ను సేకరించేవాడు. ఈ కేసులో విచారణలో అధికారులు వందల సంఖ్యలో బాధితులను గుర్తించారు. మొయిన్ దేశబహిష్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-01-05T20:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising