ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలోని శివ దుర్గ ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి

ABN, First Publish Date - 2023-02-24T16:38:03+05:30

అమెరికా, కమ్మింగ్ నగరంలోని శివ దుర్గాలయంలో పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో మహా శివరాత్రి వేడుకలు మహా సంబరంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా, కమ్మింగ్ నగరంలోని శివ దుర్గాలయంలో పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో మహా శివరాత్రి వేడుకలు మహా సంబరంగా జరిగాయి. ఫిబ్రవరి 18 ఉదయం 7 గంటలకు మొదలైన సప్త కళాభిషేకం... తెల్లవారుజామున 4 గంటల వరకు నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. పది వేల మందికి పైగా ప్రవాస భారతీయ భక్తులు తరలి వచ్చి శివనామస్మరణ పారవశ్యంలో మునిగితేలారు. ఈ సందర్భంగా సృష్టి స్థితి లయకారుడైన పరమ శివుని వివిధ రూపాలు సాక్షాత్కరింపజేయడంతో భక్తజనం పులకించిపోయింది.

"అర్ధ నారీశ్వరం, లింగోద్భవం, భస్మాభిషేకం" వంటి రూపాలు భక్తుల్ని సమ్మోహితుల్ని చేశాయి. ఇక్కడి శివ దుర్గ ఆలయంలో... హిందూ పండుగలు అన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. శివ రాత్రి సందర్భంగా పది వేలకు పైగా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చినప్పటికీ... ఎవరికీ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మహాక్రతువులో నిర్వాహకులకు రెండు వందల మందికిపైగా స్వచ్ఛంద సేవకులు సహకరించారు.

Updated Date - 2023-02-24T16:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising