కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TANA ఎన్నికలలో లావు అంజయ్య చౌదరి సంపూర్ణ మద్దతు టీం కొడాలికే

ABN, Publish Date - Dec 25 , 2023 | 07:40 PM

తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికలలో తన సంపూర్ణ మద్దతు నరేన్ కొడాలి ప్యానెల్‌కేనని తెలిపారు.

TANA ఎన్నికలలో లావు అంజయ్య చౌదరి సంపూర్ణ మద్దతు టీం కొడాలికే

ఎన్నారై డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వారికి తన సేవా కార్యక్రమాలతో పరిచయం అక్కరలేని వ్యక్తిగా నిలిచిన తాజా మాజీ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికలలో తన సంపూర్ణ మద్దతు నరేన్ కొడాలి ప్యానెల్‌కేనని తెలిపారు. అంతే కాకుండా గత నాలుగు వారాలుగా అమెరికాలో పలు ముఖ్య పట్టణాలలో సుడిగాలి పర్యటన చేసి నరేన్ కొడాలి ప్యానెల్‌కు ప్రచారం చేసారు. తానా చరిత్రలో కనీవినీఎరుగని రీతిలో చేసిన కొన్ని వందల కార్యక్రమాలలో అంజయ్య చౌదరితో భాగస్వాములైన చాలా మంది సభ్యులు ఇప్పుడు నరేన్ కొడాలి ప్యానెల్‌లో పోటీ చేస్తున్నారు.

వ్యక్తుల ప్రయోజనాలకన్నా సంస్థ ప్రయోజనాలే ముఖ్యమని భావించే అంజయ్య చౌదరి లావు, దానికి అనుగూణంగా పనిచేసే వారికి మద్దతు తెలపవలసిన అవసరం ఎంతైనా వుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్ఠాత్మక తానా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లి అమెరికా, కెనడా, ఇండియాలో తెలుగు వారికి మరింత సేవలు అందించటానికి నరేన్ కొడాలి ప్యానెల్‌ని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ పిలుపునిచ్చారు.

2.jpg

Updated Date - Dec 25 , 2023 | 07:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising