Canada: విదేశీయులకు కెనడా షాక్.. గగ్గోలు పెడుతోన్న రియల్టర్లు..!
ABN, First Publish Date - 2023-01-03T08:20:39+05:30
కెనడాలో విదేశీయులు ఇళ్ల కొనుగోలుపై విధించిన రెండేళ్ల నిషేధం ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది.
టొరంటో, జనవరి 2: కెనడాలో విదేశీయులు ఇళ్ల కొనుగోలుపై విధించిన రెండేళ్ల నిషేధం ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. స్థానికులు ఎదుర్కొంటున్న ఇళ్ల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం నుంచి శరణార్థులు, శాశ్వత నివాసితులకు మినహాయింపు ఇచ్చింది. 2021 ఎన్నికల సమయానికి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలామంది కెనడా పౌరులకు సొంత ఇల్లు కలగా మారింది. దీంతో ప్రధాని రేసులో ఉన్న జస్టిన్ ట్రూడో ఈ తాత్కాలిక నిషేధాన్ని ఎన్నికల హామీగా ఇచ్చారు. కెనడా ప్రజల అవసరం... బేరగాళ్లు, సంపన్న సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులకు లాభసాటిగా మారిందని ట్రూడో లిబరల్ పార్టీ అప్పట్లో పేర్కొంది. ‘ఇళ్లు ప్రజలకే కానీ పెట్టుబడిదారులకు కాద’న్న నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ ఎన్నికలలో విజయం సాధించిన ట్రూడో... నాన్-కెనడియన్ల చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం కెనడాలో విదేశీయులు ఇళ్లు కొనడంపై తాత్కాలిక నిషేధం అమలులోకి వచ్చింది.
Updated Date - 2023-01-03T08:20:41+05:30 IST