ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Georgia on Hinduphobia: హిందువులకు జైకొట్టిన తొలి అమెరికా రాష్ట్రం.. శాంతి కోసం హిందుత్వం పాటుపడుతోందని ప్రశంస

ABN, First Publish Date - 2023-04-02T07:50:23+05:30

హిందూవ్యతిరేక విధానాలను ఖండిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హిందూ ఫోబియాను సహించబోం

తీర్మానించిన జార్జియా రాష్ట్ర అసెంబ్లీ.. యోగా, ధ్యానం, ఆయుర్వేదం ప్రస్తావన

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 1: హిందూవ్యతిరేక విధానాలను ఖండిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. హిందూఫోబియాను, హిందూ వ్యతిరేక ఉన్మాదాన్ని అంగీకరించేది లేదని ఆ తీర్మానంలో పేర్కొంది. వందకుపైగా దేశాల్లో 120 కోట్ల మంది అనుచరులను కలిగిన ప్రపంచంలోని అతి విస్తారమైన, ప్రాచీనమైన మతధర్మంగా హిందుత్వను ప్రస్తుతించింది. హిందూఫోబియాకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. భిన్న సంప్రదాయాలు, విభిన్న విశ్వాస వ్యవస్థలకు చోటు కల్పిస్తూ, సమ్మతి సాధనను ఒక విలువగా ఆచరిస్తూ, పరస్పర గౌరవం, శాంతి కోసం హిందుత్వం పాటుపడుతోందని జార్జియా అసెంబ్లీ కొనియాడింది. అసెంబ్లీలో దీనిపై తీర్మానాన్ని లారెన్‌ మెక్‌డోనాల్డ్‌, టోడ్‌ జోన్స్‌ ప్రతిపాదించారు.

తమ తీర్మానంలో వారు యోగా ప్రస్తావన తెచ్చారు. ఆయుర్వేదం, ధ్యానం, సంగీతం, కళలు, ఆహార తదితర రంగాల్లో హిందువులకు విశిష్టమైన స్థానం ఉన్నదన్నారు. వీరిలో టోడ్‌ జోన్స్‌ హిందూసంతతి అత్యధికంగా నివసిస్తున్న అట్లాంటా నగరం పరిధిలోని ఫోర్‌సిత్‌ కౌంటీలో ఉంటున్నారు. ఇక్కడి హిందువుల సంఘీభావ సంస్థ (అట్లాంటా చాప్టర్‌ ఆఫ్‌ ద కోవిలేషన్‌ ఆఫ్‌ హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) మార్చి 22వ తేదీని హిందువుల హక్కుల దినంగా పాటిస్తూ కార్యక్రమం నిర్వహించింది. 25మంది రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ అసెంబ్లీలో తీర్మానం తెస్తామని ఈ సందర్భంగా వారంతా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హిందూఫోబియా వ్యతిరేక తీర్మానం రూపుదిద్దుకుంది.

Updated Date - 2023-04-02T07:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising