Muscat: మస్కట్‌లో కొత్త నిబంధన.. ఉల్లంఘిస్తే రూ.1లక్ష వరకు జరిమానా!
ABN, First Publish Date - 2023-03-24T11:54:32+05:30
ఒమాన్ రాజధాని మస్కట్‌లో అక్కడి మున్సిపాలిటీ కొత్త నిబంధన ప్రకటించింది.
మస్కట్: ఒమాన్ రాజధాని మస్కట్‌లో అక్కడి మున్సిపాలిటీ కొత్త నిబంధన ప్రకటించింది. సూర్యాస్తమయం తర్వాత అధికారిక సెలవు దినాలు, శుక్రవారాల్లో నివాస పరిసరాల్లో తవ్వకాలు లేదా నిర్మాణ పనులు చేయడంపై నిషేధం ఉందని మస్కట్ మున్సిపాలిటీ వెల్లడించింది. "మస్కట్‌లోని భవనాల సంస్థపై స్థానిక ఆర్డర్ నం. 23/92 ఆధారంగా సూర్యాస్తమయం తర్వాత త్రవ్వాకాలు, కూల్చివేత, నిర్మాణ పనులను అనుమతించబడవు. అయితే, ప్రభుత్వ సెలవు దినాలు, శుక్రవారాల్లో నివాస పరిసరాల్లో నిర్మాణ పనులు చేయాలంటే ముందస్తుగా మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందాలి." అని మున్సిపాలిటీ తన ప్రకటనలో పేర్కొంది. ముందస్తు అనుమతికి సంబంధించిన హౌసింగ్ మంత్రిత్వశాఖ ద్వారా ల్యాండ్ ప్లాట్ సరిహద్దుల రసీదు రుజువును సమర్పించాలని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారు 500 ఒమానీ రియాళ్ల (రూ.1,06,789) అడ్మినిస్ట్రేటివ్ జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుందని మున్సిపాలిటీ వార్నింగ్ ఇచ్చింది. భవన నిర్మాణ సంస్థలు, కార్మికులు ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకుని తమ పనులు చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: ఆ రెండు వీసాలపై యూఎస్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై వాటితో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..!
Updated Date - 2023-03-24T11:54:32+05:30 IST