ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saudi Arabia: సౌదీలో మనోళ్లకు డేంజర్ బెల్స్.. ఈ హైదరాబాదీ కుర్రాడిని ఎందుకు జైల్లో పెట్టారంటే..!

ABN, First Publish Date - 2023-07-20T18:13:25+05:30

హైద్రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి(OU) సంబందించి బి.టెక్ ఫోర్జరీ డిగ్రీను సమర్పించినందుకు సౌదీ అరేబియాలోని దమ్మాంలోని న్యాయ స్ధానం ఒక తెలుగు ప్రవాసీకు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు అయిదువేల రియాళ్ళ జరిమానను విధించింది.

  • ఉస్మానియా డిగ్రీ ఫోర్జరీ చేసినందుకు సౌదీలో ఎడాది జైలు శిక్ష

  • గల్ఫ్ లో పెద్ద సంఖ్యలో నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: వీసాలో పెర్కోన్న వృత్తి ప్రకారం ఉద్యోగాలు చేయాలనే ప్రభుత్వ నిబంధన అమలులో భాగంగా అనేక మంది తెలుగు ప్రవాసీయుల ఉద్యోగాలు ఊడడమే కాకుండా తప్పుడు విద్యార్హత పత్రాలను సమర్పించినందుకు జైళ్ళ పాలవుతున్నారు.

​సౌదీ అరేబియాలో చాలా కాలంగా పని చేస్తున్న అనేక మంది తెలుగు ప్రవాసీయులు(Telugu NRIs) నకిలీ డిగ్రీలను ప్రత్యేకించి ఇంజినీరింగ్ రంగానికి సంబంధించి డిగ్రీలను(Fake Certificates) సమర్పించి ఉద్యోగాలు చేస్తుండగా, వాటిని ఒక ప్రత్యేక ఏజన్సీ ద్వారా పరిశీలిస్తున్న ప్రభుత్వం ఆ డిగ్రీలు పోర్జరీ అని తేలితే కఠిన చర్యలు తీసుకోంటుంది. ఈ రకంగా ప్రతి వారానికి కనీసం అయిదారుగురు తెలుగు ప్రవాసీయులు జైళ్ళ పాలవుతున్నారు.

​తాజాగా హైద్రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి(OU) సంబందించి బి.టెక్ ఫోర్జరీ డిగ్రీను సమర్పించినందుకు సౌదీ అరేబియాలోని దమ్మాంలోని న్యాయ స్ధానం ఒక తెలుగు ప్రవాసీకు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు అయిదువేల రియాళ్ళ జరిమానను విధించింది(Hyderabadi jailed in Saudi Arabia). జైలు శిక్ష పూర్తయిన అనంతరం అతని వీసాను రద్దు చేసి దేశం నుండి బహిష్కరించడం జరుగుతుంది.

​పాలిటెక్నిక్ నుండి డిప్లోమాలు చేసి వచ్చి అదృష్టం కలిసి వచ్చి ఇంజినీరింగ్ ఉద్యోగాలు చేస్తుండగా డిప్లోమాలకు బదులుగా డిగ్రీలు సమర్పించిన వారు కొందరు కాగా నేరుగా బి.టెక్ లేదా బి.ఇ డిగ్రీలను ఫోర్జరీ చేసి ఉద్యోగాలు పొందిన వారు మరికొందరు ఉన్నారు. ఇంజినీరింగ్‌తో పాటు అకౌంటింగ్, వివిధ స్కిల్డ్ వృత్తుల పనులకు సంబంధించి వీసా (అఖమా) రెన్యువల్ కొరకు ఇటీవలి కాలంలో అనేక మంది తెలుగు ప్రవాసీయులు ఫోర్జరీ విద్యార్హత పత్రాలను సమర్పిస్తూ జైళ్ళ పాలవుతున్నారు.

​రాష్ట్రం నుండి అత్యధికంగా హైద్రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం జారీ చేసినట్లుగా నకిలీ డిగ్రీల సహాయంతో సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు.

Updated Date - 2023-07-20T18:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising