ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Ambassador: వచ్చే ఏడాది అబుదాబిలో మొదటి ఐఐటీ క్యాంపస్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2023-02-19T08:53:29+05:30

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) వచ్చే ఏడాది అబుదాబిలో తన మొదటి విదేశీ క్యాంపస్‌ను ప్రారంభించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) వచ్చే ఏడాది అబుదాబిలో తన మొదటి విదేశీ క్యాంపస్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ (Indian Ambassador Sunjay Sudhir) వెల్లడించారు. వచ్చే ఏడాది తరగుతులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఐఐటీ (IIT) ఢిల్లీకి చెందిన ఉన్నత స్థాయి బృందం యూఏఈ రాజధాని పర్యటన సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అబుదాబి (ADEK) అధికారులతో దీని గురించి విస్తృతంగా చర్చలు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా రాయబారి గుర్తు చేశారు.

ప్రస్తుతం ఇండియాలో 23 ఐఐటీలు ఉన్నాయి. ఇవి దేశంలోని వివిధ ప్రాంతాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఐఐటీల్లో చాలా నాణ్యమైన విద్య ఉంటుంది. అందుకే వీటిలో ప్రవేశాల కోసం ప్రతియేటా భారీ సంఖ్యలో విద్యార్థులు పోటీ పడుతుంటారు కూడా. ఐఐటీల్లో చదివిన చాలా మంది మనోళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. వారిలో అల్ఫాబెట్-గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai), భారతీయ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ నారాయణమూర్తి వంటి ప్రముఖ పూర్వ విద్యార్థులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఎవరీ వివేక్ రామస్వామి..? అన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిని అవుతానంటున్న ఈ ఎన్నారై బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

Updated Date - 2023-02-19T08:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising