ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాకు పెరిగిన అక్రమ వలసలు..సరిహద్దు వద్ద పోలీసులకు చిక్కుతున్న భారతీయులు..

ABN, First Publish Date - 2023-01-03T21:00:19+05:30

భారత్ నుంచి అమెరికాకు అక్రమవలసలు పెరిగినట్టు తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాకు(USA) అక్రమంగా వలసపోతున్న భారతీయుల(Illegal Immigration) సంఖ్య పెరిగినట్టు తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తూ అధికారులకు పట్టుబడ్డ భారతీయుల(Indians) సంఖ్య 2022లో రెండింతలకు పైగానే పెరిగినట్టు(Surge) అధికారిక లెక్కల్లో తేలింది. గత అక్టోబర్ నవంబర్ నెలల్లో అమెరికా సరిహద్దు గస్తీ దళాలు మెక్సి్కో సరిహద్దు వద్ద 4,297 మంది భారతీయుల్ని అదుపులోకి తీసుకున్నాయి. 2021 ఏడాది ఇదే కాలంలో అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డ ఇండియన్ల సంఖ్య 1,426. స్థూలంగా చూస్తే.. 2021-22 మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయి అధికారులకు చిక్కిన ఇండియన్ల సంఖ్య రెండింతలకు పైగానే పెరిగిందని ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాలోకి అక్రమవలసలు పెరిగాయని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. అమెరికా సరిహద్దులు సురక్షితమని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తరచూ చెబుతున్నప్పటికీ..క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వివిధ దేశాలకు చెందిన 2.77 మిలియన్ల మంది అగ్రరాజ్యంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంతకుమునుపటి ఏడాదితో పోలిస్తే అక్రమవలసలు 41 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ శాఖ గణాంకాల్లో తేలింది.

Updated Date - 2023-01-03T21:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising