Home » Immigrants
ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల్లో ఇకపై స్త్రీ లేదా పురుషులే గుర్తించబడతారు. 2023లో ప్రవేశపెట్టిన ఇతర జెండర్ ఎంపికను తొలగించి, బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా లింగాన్ని గుర్తించనుంది
అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని దేశం నుంచి బహిష్కరించడమే కాక.. అరెస్ట్ చేసి.. జైల్లో ఉంచుతుంది. ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి వేస్తుంది. ఈ క్రమంలో ఓ జంటను ఇలానే అమెరికా నుంచి బహిష్కరించి.. దేశం నుంచి పంపించివేసింది ట్రంప్ సర్కార్. ఆ వివరాలు..
Illegal Migration on UK : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. కఠిన చర్యలను అమలు చేస్తూ వలసదారులను బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పుడు మా వంతు అంటూ తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారుల ఏరివేత మొదలుపెట్టింది. భారతీయ రెస్టారెంట్‌లే మెయిన్ టార్గెట్‌గా పలు చోట్ల దాడులు చేసి వందల మందిని అరెస్టు చేసి హడలెత్తిస్తోంది.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.
అక్రమంగా యూఎస్‌లో నివసిస్తున్న భారతీయులను గుర్తించి స్వదేశానికి తరలిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. 205 మందితో కూడిన ఓ విమానం టెక్సాస్ నుంచి స్వదేశానికి బయలుదేరినట్లు సమాచారం.
అక్రమవలసదారులపై కేంద్ర కొరడా ఝలిపించడంపై మాట్లాడుతూ, కేవలం అక్రమవలసలపై దృష్టిసారించకుండా గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రజా సమస్యలపై కేంద్రం దృష్టిపెడితే బాగుంటుందని శ్యాం పిట్రోడా అన్నారు.
ఆస్ట్రేలియా కొత్త వీసా విధానం భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది.
బతుకుతెరువు కోసం పరాయి దేశాలకు భారతీయులు అక్రమమార్గాల్లో వలస. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న వైనం.
భారతీయులను సరిహద్దు దాటించి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశపెట్టేందుకు క్రిమినల్ గ్యాంగ్‌లు ఒక్కొక్కరి నుంచీ 21 వేల డాలర్లు పుచ్చుకుంటున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
భారతీయులు సముద్ర మార్గంలో అక్రమంగా బ్రిటన్‌లోకి చొరబడుతున్నారని బ్రిటన్ హోం శాఖ వర్గాలు పేర్కొన్నట్టు ‘ది టైమ్స్ పత్రిక’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.